ఏపీలో టీడీపీకి వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమమే సీన్ ఉంటుంది. ఈ సంగతి రాజకీయాల మీద అవగాహన ఉన్న వారందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికీ అధికారంలోకి రాదు అన్న వైసీపీ పవర్ లోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం అన్నది టీడీపీ అసలు తట్టుకోలేకపోతోంది. మామూలుగా ఎన్నికల్లో ఓటమి గెలుపు సహజం. ఒకసారి అన్నీ చేసిన రాత బాగుండక ఓడిపోతారు. కానీ తెలుగుదేశంలో మాత్రం అధినేత చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్త వరకూ అంతా అనుకున్నది ఏంటి అంటే 2019 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుదని. సీట్లు కొంత తగ్గుతాయి తప్ప పక్కాగా పవర్ గ్యారంటీ అనుకున్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి రావడమే కాదు ఏకంగా 151 సీట్లు దక్కడంతో టీడీపీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో పాటుగా వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో వారు ఇంకా మండిపోతున్నారు. ఇక టీడీపీలో నిన్నటి దాకా ఉంటూ వచ్చిన కొడాలి నాని వైసీపీలో మంత్రి కావడం కూడా ఆయన సామాజిక వర్గానికి అసలు నచ్చలేదు. ఆయన పదవిలో ఉన్న వారు ఉండకుండా టీడీపీ బెండు తీసేలా హాట్ కామెంట్స్ చేయడంతో తమ్ముళ్ళకు ఒక్క లెక్కన కాలుతోందిట. అందుకే గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లాంటి వారు కొడాలి నాని మీద గట్టిగా విరుచుకుపడుతున్నారు.

మేము అధికారంలోకి రావడం ఖాయం. 2024లో టీడీపీ పవర్ లోకి వస్తే మొదట చేసే పని కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని పోలీసులు రోడ్డు మీద ఈడ్చుకువెళ్ళినట్లుగా తీసుకెళ్తామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. అంటే అధికారంలోకి వస్తే టీడీపీ వైసీపీ నేతలను ఎవరినీ వదలదు అని ఇప్పటి నుంచే చెబుతున్నారన్న మాట. అంతే కాదు ప్రతీ వారి బాకీని కచ్చితంగా తీర్చుకుంటామని యరపతినేని అంటున్నారు. దీని మీద గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ఇక పార్టీ పిలుపు ఇచ్చిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాడే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. మొత్తానికి కొందరు తమ్ముళ్ళ కసి చూస్తూంటే అధికారంలోకి వచ్చాక తేల్చుకుంటామన్న తీరున ఉంది. మరి ఇదే కసి పార్టీ మీద పెడితే కదా గెలిచేది అంటున్నారు సొంత పార్టీ వారే..!

Discussion about this post