వైసీపీలో అంతర్గత కట్టుబాట్లు, అధినాయకత్వం విషయంలో అప్రమత్తతలు ఎక్కువ. పైకి మాత్రం అధిష్టానాన్ని పొగడ్తలతో ముంచెత్తి.. తమకు తిరుగులేని ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకొన్నప్పటికీ.. నేతలు మాత్రం అధిష్టానం నిర్ణయాల మేరకే నడుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా.. అధిష్టానం నుంచి ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి. పైకి మాత్రం ఇవేవీ కనిపించవు. అందుకే.. మీడియా ముందుకు వచ్చే నేతలు కూడా ఆచి తూచి మాట్లాడతారు. ఒకరిద్దరు కీలక నేతలు తప్ప.. మిగిలిన ప్రతి ఒక్కరూ.. అధిష్టానం కనుసన్నల్లో పనిచేయాల్సిందే.
అధిష్టానం చెప్పినట్టు.. అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు.. నడవాల్సిందే. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. అంతిమంగా.. అధిష్టానం..కొందరు కీలక సలహాదారులు, నేతల నిర్ణయాలే వర్కవుట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. అధిష్టానం నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని.. లేదా.. పైచేయి సాధించాలని చూసే వారిని పక్కన పెడుతున్న నేపథ్యంలో కీలక నాయకుడు, ఇటీవలే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎంపీ.. గురుమూర్తి.. తాజాగా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారనే వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలోను, వైసీపీ సైట్లలోనూ జోరుగా వినిపిస్తోంది.ఇటీవలే పార్లమెంటుకు ఎన్నికైన గురుమూర్తి సహా.. పలువురు ఎంపీలతో లోక్‌సభ స్పీకర్.. ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలో గురుమూర్తి.. తన ప్రమాణ స్వీకారాన్ని.. తెలుగులో చదివి వినిపించారు. దేవుడి సాక్షిగా అంటూ.. ఆయన మొత్తం తెలుగులోనే ప్రమాణం చేశారు. వాస్తవానికి తెలుగుపై వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. తెలుగును తగ్గించి ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టాలనేది పార్టీ ప్రధాన నిర్ణయం. దీనిపై గతంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. పార్లమెంటులో ప్రశ్నించారు. వెంటనే ఆయనను తాడేపల్లికి పిలిచిన సీఎం జగన్ .. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు.
ఇప్పుడు జగన్ కు సన్నిహితుడు, తన స్నేహితుడు అని చెప్పుకొనే డాక్టర్ గురుమూర్తి తెలుగులో ప్రమాణం చేయడంతో.. వైసీపీ నేతలు సభలోనే ఖంగుతిన్నారు. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా.. వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు వెంటనే సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా.. ప్రధాన ప్రతిపక్షం.. టీడీపీ ఏకంగా.. తెలుగు నిషేధం విషయంలో ఒక్క జగన్ కుత ప్ప.. ఆ యన సొంత పార్టీ నేతలకు కూడా ఇష్టం లేదనే కామెంట్లను వైరల్ చేసింది. మొత్తంగా ఈ పరిణామం.. జగన్ కు ఇబ్బందిగానే మారిందని అంటున్నారు. జరిగింది చిన్న ఘటనే అయినప్పటికీ.. పార్లమెంటు వేదికగా జరగడంతో.. ప్రాధాన్యం సంతరించుకుంది.
Discussion about this post