గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ గాలి వీస్తోంది. ఎవరిని పలకరించిన వేగేశ్న నరేంద్ర వర్మ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం.. ఒక కృషి-ఒక పట్టుదలే! ఎట్టి పరిస్థితిలోనూ బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలనే సత్సంకల్పంతో ముందుకు సాగిన వర్మ.. ఆ పార్టీ అభ్యు న్నతి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మరెంతో కృషి చేశారు. ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో పాటు.. నిబద్ధతతో కూడిన లక్ష్యం.. వేగేశ్నకు ఆది నుంచి ఇష్టమైన పనులనే చెప్పాలి.

వృత్తి రీత్యా పారిశ్రామిక వేత్త అయిన వేగేశ్న.. వచ్చిన లాభాలను సొంతానికి వాడుకోవడం కాకుండా… ప్రజలకు వివిధ రూపాల్లో పంచుతున్న విషయం బాపట్ల సహా గుంటూరు ప్రజలకు అందరికీ తెలిసిందే. వేగేశ్న ఫౌండేషన్ ఏర్పాటు చేసి.. నియోజకవర్గంలో పేదలకు అండగా నిలుస్తున్నారు. అదే సమయంలో సామాజిక సేవా దృక్ఫథంతో ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఒక్కరికీ నేనున్నానంటూ.. భరోసా కల్పించారు. నీటి ఎద్దడి సమయంలో స్వయంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. బాపట్ల ప్రజల దాహార్తి తీర్చిన వేగేశ్న పట్ల ఇక్కడి ప్రజలకు ఎంతో ఆదరాభిమానం ఉండడం గమనార్హం.

ఇక, ఈ క్రమంలో మరింతగా ప్రజాసేవ చేయాలనే తలంపుతో.. వేగేశ్న.. రాజకీయ బాటపట్టారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన.. తెలుగు దేశం పార్టీలో చేరారు. నాటి నుంచి ఆయన పదవుల కోసం ఆశించకుండా.. అటు పార్టీకి, ఇటు ప్రజలకు కూడా అండగా ఉంటున్నారు. పార్టీని సమన్వయ పరుస్తూ.. ప్రజల మధ్యే ఉంటూ.. ఆయన నిత్యం ప్రజాసేవలో మునిగితేలుతున్నారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. సమస్య ఏదైనా.. పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అదేసమయంలో పార్టీ కార్యక్రమాల్లోనూ జోరుగా పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే గత ఏడాది ఎన్నికల సమయంలో ఆయన బాపట్ల నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. నిజానికి ఇది ఆయన కోరిక అనేకన్నా.. ప్రజలే ఆయనను కోరుకున్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే.. అప్పట్లో వర్మకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం .. చంద్రబాబు.. ఆయనకు బాపట్ల ఇంచార్జ్ పోస్టును ఇచ్చి.. నియోజకవర్గాన్ని ఆయన చేతిలో పెట్టారు. ఇక, అప్పటి నుంచి కూడా పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తూ.. ప్రజల కు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వర్మను అఖండ మెజారిటీతో గెలిపించుకునేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉండడం గమనార్హం.

Discussion about this post