ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో ఆయన తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తారు తప్ప… తనకు ఎంతో నమ్మకంగా ఉన్న వారిని అయినా చాలా సులువుగా పక్కన పెట్టేస్తారు అన్న అభిప్రాయం ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో ఉంది. జగన్ కోసం ఎంతో చేసిన సొంత వారినే పట్టించుకోనప్పుడు ఇక పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో త్యాగాలు చేసి… ఎంతో కోల్పోయిన సీనియర్లను సైతం ఎందుకు పట్టించుకుంటారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ జైలులో ఉన్నప్పుడు వైసీపీ కోసం ఆయన సోదరి షర్మిల ఎంతో కష్టపడ్డారు. నాటి సమైక్య రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. 2012 ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు.
అయితే 2014 ఎన్నికల్లో ఆమె కడప ఎంపీ సీటు ఆశించగా దక్కలేదు. ఆ తర్వాత ఖమ్మం ఎంపీ సీటుపై ఆశ పడ్డా అది దక్కలేదు. చివరకు గత ఎన్నికల్లో ఒంగోలు సీటు కోసం షర్మిల విశ్వప్రయత్నాలు చేసిన జగన్ అది కూడా ఇవ్వలేదు. చివరకు రాజ్యసభ దక్కుతుందనుకున్న షర్మిల ఆశలు అడియాసలయ్యాయి. ఇక ఇప్పుడు బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి వంతు వచ్చింది. వైవీ కోరిక జగన్ తీర్చలేదు. టీటీడీ చైర్మన్ గా 2010 కాలం పూర్తి చేసుకున్న ఆయన రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవికి ఎంపికై.. ఏపీ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టాలని ఆశపడ్డారు. అయితే జగన్ ఆయన్ను మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నియమించారు. మరో రెండేళ్ల పాటు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు.
ఇక బాబాయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కన్న కలలు అడియాసలు అయ్యాయి. ఇక రేపో మాపో సజ్జల వర్సెస్ విజయసాయి మధ్య వార్ నేపథ్యంలో జగన్ ఎవరో ఒకరికి ఝులక్ ఇచ్చేసి పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేస్తారని పార్టీ నేతలే చర్చించు కుంటున్నారు. వీరిలో విజయసాయికే జగన్ ఎక్కువుగా చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఓ టాక్ అయితే వినిపిస్తోంది. పార్టీ ఆఫీస్ కేంద్రంగా సజ్జల వర్సెస్ విజయసాయి మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోందని.. ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మరి జగన్ మార్క్ ఝులక్ నెక్ట్స్ ఎవరికి ? ఎలా ఉంటుందో ? ఏం జరుగుతుందో ? అన్నది చూడాలి.
Discussion about this post