శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అంటే మొదట గుర్తొచ్చే పేరు..కింజరాపు ఫ్యామిలీనే. దశాబ్దాల పాటు కింజరాపు ఫ్యామిలీ తెలుగుదేశంలో పనిచేస్తుంది. దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు, చంద్రబాబుకు కుడి భుజం మాదిరిగా పనిచేసేవారు. ఆ తర్వాత ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడులు బాబుకు అండగా ఉంటూ వస్తున్నారు. అటు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో కింజరాపు ఫ్యామిలీనే మెయిన్. కింజరాపు ఫ్యామిలీ ఉంది కాబట్టే, సిక్కోలు టీడీపీకి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ మొదట నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చిది. అందుకే గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ ఉన్నా సరే శ్రీకాకుళం పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు గెలిచారు. అటు టెక్కలిలో అచ్చెన్నాయుడు విజయం సాధించారు. కంచుకోట ఇచ్చాపురంలో కూడా టీడీపీ సత్తా చాటింది.
అయితే ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత పెరిగింది. అటు టీడీపీ నేతలు పుంజుకుంటున్నారు. ఇక సిక్కోలులో రామ్మోహన్, అచ్చెన్నలు టీడీపీని ఉన్నంతలో బలోపేతం చేశారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో గుండా లక్ష్మీ ఉన్నారు. కాస్త వయసు మీద పడిన కూడా లక్ష్మీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఈమెకు రామ్మోహన్ సపోర్ట్ ఇస్తున్నారు. అటు ఆమదాలవలసలో కూన రవికుమార్ దూకుడుగా ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.కూన పార్టీ పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన దూకుడుగా ముందుకు వెళ్లి కేసుల్లో ఇరుక్కుంటున్నా రామ్మోహన్ ఆయన కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నారు. పాతపట్నంలో కలమట వెంకట రమణ మూర్తి పుంజుకున్నారు. పలాసలో గౌతు శిరీష ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న గౌతు శిరీష యాక్టివ్ కావడం పలాసలో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ వచ్చింది. శిరీష దంపతులు తమ కంచుకోటని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి సైతం పార్టీ కోసం పనిచేస్తున్నారు.
ఇక టెక్కలిలో అచ్చెన్న దూకుడుకు బ్రేకులు వేసేందుకు జిల్లా పదవులు అన్ని జగన్ అక్కడ నేతలకే ఇస్తున్నా ఉపయోగం లేదు. అచ్చెన్న జోరు అలాగే కొనసాగుతోంది. పైగా విజయసాయి రెడ్డి సైతం ఇక్కడ దృష్టి పెడతున్నా ఉపయోగం లేదు. మొత్తానికి చూసుకుంటే సిక్కోలులో టీడీపీ రెండేళ్లకే సెట్ అయినట్లే కనిపిస్తోంది. బాబాయ్ – అబ్బాయ్ పోరాటాలు ఇక్కడ పార్టీ శ్రేణుల్లో జోష్ డ్రాప్ కాకుండా చూస్తున్నాయి.
Discussion about this post