గత రెండేళ్లుగా సైలెంట్‌గా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ సడన్‌గా ఆందోళన చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని తెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకిత వస్తుందనే చెప్పే, వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో పర్ఫామెన్స్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
ఈ క్రమంలోనే కొత్తగా ఎంపీ అయిన మార్గాని భరత్, హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదాను వదిలి ప్యాకేజీని ఏ రకంగా ఒప్పుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించిన భరత్…నాడు అలా లొంగిపోవడంవల్లే నేడు ఏపీ ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే భరత్ బాగానే ప్రశ్నించారని, కానీ అక్కడే ఓ లాజిక్ మిస్ అవుతున్నారని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.గతంలో కూడా కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే చంద్రబాబు రాష్ట్రానికి కావల్సిన నిధులని ఎలాగోలా రప్పించుకునేవారు. అలాగే హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని, దానికి మించిన ప్యాకేజ్ ఇస్తామని చెప్పడంతో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ప్యాకేజ్ ఒప్పుకున్నారని, కానీ తర్వాత వేరే రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తూ, ఏపీకి ఇవ్వకపోవడంతో చంద్రబాబు బీజేపీ నుంచి బయటకొచ్చి, హోదా కోసం పోరాటం చేశారని గుర్తు చేస్తున్నారు.
ఇక ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు లోక్‌సభలో ఎప్పుడు హోదా కోసం కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు. కానీ రెండేళ్లుగా కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్న వైసీపీ ఎంపీలు, చంద్రబాబుని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచి జగన్ హోదా తెస్తానని అన్నారని, మరి మెడలు ఎవరు వంచారో ప్రజలకు బాగా తెలుసని వైసీపీకి తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.
Discussion about this post