ఏపీలో వైసీపీ అనుకూల మీడియా చంద్రబాబుపై ఉన్న కడుపు మంటని బాగా చూపిస్తుంది. అసలు జగన్ చేసే తప్పులని కప్పిపుచ్చుతూ, ఆయనే నెంబర్ 1 అనే విధంగా ప్రచారం చేస్తుంది. అలాగే బాబుపై ఎక్కడా లేని విషప్రచారం చేస్తుంది. తాజాగా జగన్ ‘గ్రేట్’ అంటూ భజన చేసే ఓ బ్లూ సంస్థ…బాబుపై ప్రదర్శిస్తున్న కడుపు మంటపై తెలుగుతమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఇంకా బాబునే విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆ బ్లూ మీడియా. అసలు హోదా అనేది రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ఆ హోదాని బాబే అడ్డుకున్నారని ఇంకా విషప్రచారం చేస్తుందని తమ్ముళ్ళు మండిపడుతున్నారు. అసలు హోదా గురించే మాట్లాడే అర్హత జగన్‌కే ఉందని గుడ్డిగా భజన చేస్తుందని, ఆ భజన నమ్మేది, గుడ్డిగా ఉన్న వైసీపీ భక్తులే అని చెబుతున్నారు.
గతంలో కేంద్రంలో బీజేపీతో చంద్రబాబు పొత్తులో ఉన్న మాటవాస్తవమే. అప్పుడు కూడా బీజేపీకి మంచి మెజారిటీ ఉంది. దీంతో రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని బాబు కేంద్రంతో సఖ్యతగా ముందుకెళ్లారు. ఇక ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేము, దాని బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని నమ్మిస్తే, అప్పుడు బాబు ప్యాకేజ్‌కు ఒప్పుకున్నారని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కానీ వేరే రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తూ మోసం చేయడంపై చంద్రబాబు ఎదురుతిరిగి కేంద్రం నుంచి బయటకొచ్చి హోదా కోసం పోరాడారని చెబుతున్నారు.
అదే సమయంలో 25కి 25 ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి హోదా తీసుకోస్తానని జగన్ చెప్పి, అధికారంలోకి వచ్చి మెడలు వంచలేనని చెప్పి, మోదీ దగ్గర జగన్ నడుము వంచారని విమర్శిస్తున్నారు. అంటే ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకపోతే మెడలు వంచుతానని జగన్ ఏమి చెప్పలేదని, ఎలాంటి పరిస్తితి ఉన్నా పోరాడేస్తా అనే రేంజ్‌లోనే జగన్ స్పీచ్‌లు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం, కేంద్రంలో బీజేపీకి మెజారిటీ ఉందని, ప్లీజ్, ప్లీజ్ అని అడగటం తప్ప గట్టిగా డిమాండ్ చేయలేమని చేతులెత్తేసి, జనాలని మోసం చేసిన జగన్‌కు బ్లూ మీడియా వంత పాడుతూ, బాబుపై విమర్శలు చేస్తూ ఇంకా తమ కడుపు మంటని చూపిస్తున్నారని తమ్ముళ్ళు మండిపడుతున్నారు.
Discussion about this post