దివంగత ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు గ్రామం అనే సంగతి తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. అయితే పుట్టిన గడ్డలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. నిమ్మకూరు గ్రామం ఉన్న పామర్రు నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే వచ్చింది.

అయితే ఈ సారి మాత్రం పామర్రులో టీడీపీకి మంచి ఛాన్స్ దొరికేలా కనిపిస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీపై వ్యతిరేకిత మొదలైంది. ఏదో పథకాల పేరుతో పావలా ప్రజలకు ఇచ్చి, పన్నుల రూపంలో రూపాయి లాగేసుకుంటుంది జగన్ ప్రభుత్వం. ఇదేగాక జగన్ ప్రభుత్వంలో ప్రజలు అన్నిరకాలుగా ఆర్ధికంగా నష్టపోతున్నారు. పైగా జరిగే అభివృద్ధి శూన్యం. పామర్రు నియోజకవర్గంలో గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమి లేదు. భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయిన కైలా అనీల్ కుమార్ మెరుగిన పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.

పైగా నియోజకవర్గంలో ఇసుకలో దోపిడి, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, కాంట్రాక్ట్‌ల్లో అవినీతి ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్తితుల నేపథ్యంలో నియోజకవర్గంలో వైసీపీపై ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇదే టీడీపీకి కలిసొచ్చే పరిణామం. కానీ ఇక్కడ టీడీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన, పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. అధికార వైసీపీ చేసే అక్రమాలని ప్రశ్నించడంలో వెనుకబడి ఉన్నారు. క్యాడర్‌ని కలుపుకునిపోవడం లేదు.

అందుకే కల్పనని పక్కనబెట్టి మరో బలమైన నేతకు పామర్రు బాధ్యతలు అప్పగించాలని, అక్కడ పార్టీ క్యాడర్ కోరుతుంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. పోనీ కల్పనని యాక్టివ్ చేస్తే అది పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదంటే గెలిచే చోట మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని టీడీపీ క్యాడర్ చెబుతోంది.
Discussion about this post