టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో 13 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఉన్న విషయం తెలిసిందే. ఈ 13 మందిలో మెరుగైన పనితీరు కనబర్చిచే ఎమ్మెల్యేలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పొచ్చు. ఏదో జగన్ గాలిలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు గానీ, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అండగా నిలబడటంలో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.

జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వారు స్ట్రాంగ్‌గా ఉన్నారు గానీ, మిగిలిన వారు అంత బలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే ఇలాంటి సమయంలోనే టీడీపీకి పుంజుకోవడానికి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు మినహా మిగిలిన వారు యాక్టివ్‌గా పార్టీ తరుపున పని చేస్తున్నట్లు కనిపించడం లేదు.

అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బొజ్జల సుధీర్ రెడ్డి లాంటి వారు పార్టీలో కాస్త కనిపిస్తున్నారు. మిగిలిన నేతలు అడ్రెస్ లేరు. దీంతో జిల్లాలో టీడీపీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబుకు అయినా సరే జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయన కూడా అంతగా జిల్లాని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

పైగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లని కూడా పెట్టలేదు. పూతలపట్టు, చిత్తూరు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి ఇన్‌చార్జ్‌లు లేరు. ఈ రెండు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత ఉంది. కానీ టీడీపీకి నాయకులు లేరు. కాబట్టి బాబు ఇప్పటికైనా సొంత జిల్లా మీద ఫోకస్ చేసి, పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది.

Discussion about this post