తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని పార్లమెంట్ స్థానాల్లో ఒంగోలు ఒకటి. ఈ పార్లమెంట్ స్థానంలో టీడీపీకి విజయావకాశాలు చాలా తక్కువ. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఎక్కువసార్లు గెలిచిన సందర్భాలు లేవు. కేవలం రెండు అంటే రెండు సార్లు మాత్రమే ఒంగోలులో టీడీపీ గెలిచింది. 1984, 1999 ఎన్నికల్లో మాత్రమే ఒంగోలులో టీడీపీ గెలిచింది. ఇక ఎక్కువసార్లు కాంగ్రెస్ హవా నడిచింది. ఇప్పుడు వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది.

గత రెండు పర్యాయాలు ఇక్కడ వైసీపీనే గెలిచింది. టీడీపీ అభ్యర్ధులని మార్చిన పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. పైగా రెండు ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన నాయకులు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీకి ఇన్‌చార్జ్ లేరు. అయితే పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాత్రం పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. పార్టీని మళ్ళీ నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు.పైగా గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానంతో పాటు, పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఆరు చోట్ల ఓడిపోయింది. ఒక్క కొండపి నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ గెలిచింది. దీన్తి నూకసాని మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌లని సమన్వయం చేసుకుంటూ, ఆయా నియోజకవర్గాల్లో పార్టీకు పునర్వైభవం తెచ్చేందుకు కష్టపడుతున్నారు.

ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో కలిసి స్థానిక సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. అటు పెండింగ్‌లో ఉన్న నరేగా నిధులు కోసం పోరాడుతున్నారు. ఒంగోలు పార్లమెంట్‌లో రైతుల సమస్యలపై కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఇలా నూకసాని పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా బాగానే యాక్టివ్ అయ్యి, పార్టీ తరుపున పనిచేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వీరు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పార్టీని ఏ మేర గెలిపిస్తారో చూడాలి.
Discussion about this post