అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు ఒకలా ఉండటం రాజకీయ నాయకులకు బాగా అలవాటైన పని. అధికారంలో ఉన్నప్పుడు అంతా తమదే అన్నట్లుగా రాజకీయం చేస్తారు…అధికారం కోల్పోయాక మనకు ఎందుకులే ఇదంతా అన్నట్లుగా ముందుకెళ్తారు. ఇప్పుడు కరెక్ట్‌గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువులది అదే పరిస్తితి. అధికారంలో ఉన్నప్పుడు ఓ వైపు గంటా శ్రీనివాసరావు, మరోవైపు ఆయన వియ్యంకుడు నారాయణలు టీడీపీలో ఎలాంటి కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే.

అధికారం కోల్పోయాక ఇద్దరు నేతలు సైడ్ అయిపోయారు. ఇక గంటా మరో వియ్యంకుడు పులపర్తి అంజిబాబుది కూడా అదే పరిస్తితి. 2014లో టీడీపీ తరుపున భీమవరం ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి ఐదేళ్ల పాటు బాగానే హడావిడి చేశారని, కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రెస్ లేకుండా వెళ్లిపోయారని భీమవరం తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. 2019లో భీమవరంలో ముక్కోణపు ఫైట్ జరిగింది. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, జనసేన నుంచి పవన్ కల్యాణ్, టీడీపీ నుంచి పులపర్తి బరిలోకి దిగారు. ఇక ఆ పోరులో గ్రంథి గెలవగా, పవన్ సెకండ్, అంజిబాబు థర్డ్ ప్లేస్‌ల్లో నిలిచారు.

ఇలా ఓడిపోయిన దగ్గర నుంచి అంజిబాబు అడ్రెస్ లేరు. భీమవరంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. నియోజకవర్గంలో పనిచేయాలని మధ్యలో అధినేత చంద్రబాబు చెప్పిన సరే అంజిబాబు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అసలు భీమవరంలో టీడీపీ ఉందా అనే పరిస్తితికి వచ్చేసింది. ఈ క్రమంలోనే యాక్టివ్‌గా లేని అంజిబాబుని పక్కనబెట్టి, మరో బలమైన నాయకుడుకు భీమవరం బాధ్యతలు అప్పగించాలని స్థానికంగా ఉండే కొందరు తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి నారాయణ సైడ్ అయిపోతే నెల్లూరు సిటీకి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. అలాగే భీమవరంలో గంటా వియ్యంకుడుని సైడ్ చేయాలంటూ పలువురు తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Discussion about this post