ఏపీలో వైసీపీ మీద పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అది కూడా ఈ ఆరు నెలలలో బాగా పెరిగింది అని కూడా కచ్చితంగా తెలిసిపోతోంది. ఇక తాజాగా వస్తున్న కొన్ని సర్వేలు అయితే ఏపీలో వైసీపీ గ్రాఫ్ సగానికి సగం పడిపోయింది అని చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో టీడీపీకి ఇదే బంగారం లాంటి అవకాశం. ఏపీలో విపక్షం ప్లేస్ లో టీడీపీ ఒక్కటే ఉంది. తెలంగాణాలో మాదిరిగా బహుళ పార్టీల పోరు ఇక్కడ లేదు. దాంతో వైసీపీ వ్యతిరేక ఓటు ఏది టర్న్ అయినా అది కచ్చితంగా వచ్చి టీడీపీ ఒడిలో పడాల్సిందే.

మరో వైపు కేంద్రానికి వైసీపీకి చెడింది అన్న వార్తలు వస్తున్నాయి. చెడినా లేకపోయినా కూడా ఏపీని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కాపాడదు అన్నది మాత్రం నూరు శాతం నిజం. ఎందుకంటే ఏపీ చేజేతులా చేసుకున్న దానికి కేంద్రాన్ని నిందించి కూడా ఉపయోగం లేదు. ఏపీని అప్పుల కుప్పగా జగన్ స్వయంగా చేసుకున్నారు. ఆయన అలవి కానీ హామీలే ఈ రోజు ఏపీ కొంప ముంచుతున్నాయి. ఏపీలో చాలా వర్గాలలో ఇపుడు వైసీపీ మీద కోపం ఉంది. దాన్ని వారు ఈ రోజుకు బయటకు చెప్పకపోయినా కూడా ఏదో రోజు బయటపడడం ఖాయం.

మరి అలాంటి అసంతృప్తిని కనుక చక్కగా వాడుకుంటే మాత్రం ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అన్నింటికీ మించి ఏపీ సర్కార్ లో అడుగడుగునా కనిపిస్తున్న మరో విషయం అనుభవ రాహిత్యం. ముఖ్యమంత్రితో మొదలుకుని మంత్రుల దాకా అందరూ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. దాంతో ప్రభుత్వ ప్రతిష్ట కూడా ఇబ్బందుల్లో పడుతోంది.

తొలి ఏడాది నుంచే మొదలైన ఈ ఇబ్బందులు ఇపుడు రెట్టింపు అయ్యాయి. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు వైసీపీ వైఫల్యాలే పెట్టుబడిగా చేసుకుని టీడీపీ మళ్ళీ జనంలోకి వచ్చి పోరాడితే కచ్చితంగా విజయం ఖాయమని.. బాబు మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయ మే అంటున్నారు. చూడాలి మరి. చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో..!

Discussion about this post