కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అడ్డాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఇంతవరకు ఓటమి ఎరుగదు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. అటు హిందూపురంలో నందమూరి బాలకృష్ణకు ఎదురులేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇవే స్థానాల నుంచి వారు బరిలో దిగుతారా? లేక నారా లోకేష్‌ని గెలిపించడానికి తమ స్థానాలని మార్చుకుంటారా? అంటే ఈ సారి ముగ్గురు స్థానాలని మార్చుకుంటారని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే చంద్రబాబుకు వయసు మీద పడిందని, నెక్స్ట్ ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని అందుకనే కుప్పం సీటుని లోకేష్‌కు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అక్కడైతే లోకేష్ విజయానికి ఎలాంటి ఢోకా లేదని అనుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు, హిందూపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారని, నందమూరి ఫ్యామిలీ అడ్డాగా ఉన్న హిందూపురంలో బాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట.

ఇక బాలయ్యని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి పంపిస్తారట. అక్కడ కొడాలి నానికి చెక్ పెట్టాలంటే బాలయ్యే కరెక్ట్ అని బాబు అనుకుంటున్నారట. ఇలా ముగ్గురు తమ తమ సీట్లని మార్చుకుంటున్నారని ప్రచారం వస్తుంది. కానీ వాస్తవ పరిస్తితులని చూసుకుంటే ఈ ముగ్గురు సీట్లలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన లోకేష్, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఈ సారి ఎలాగైనా గెలవాలని లోకేష్ కసితో పనిచేస్తున్నారని అంటున్నాయి.అటు బాలయ్య మళ్ళీ హిందూపురం నుంచి, చంద్రబాబు కుప్పం నుంచే బరిలో దిగి సత్తా చాటనున్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురు సీట్లు విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని అంటున్నారు.
Discussion about this post