టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలని ఆయన పరామర్శించారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాల్లో బాబు పర్యటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అలాగే జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని, స్థానిక మంత్రి పేర్ని నానిపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అలాగే కేసీఆర్-జగన్‌లు కలిసి ఆడుతున్న నీటి డ్రామాపై కూడా బాబు ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఇక జగన్ ప్రభుత్వం నీటి వివాదంపై డ్రామా ఆడుతుందని ప్రజలకు అర్ధమయ్యి, తమకు ఎక్కడా నెగిటివ్ అవుతుందనే భయంతో మంత్రి పేర్ని నాని ఎదురుదాడి మొదలుపెట్టారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. నీటి వివాదంపై మీ స్టాండ్ ఏంటని బాబుని ప్రశ్నించిన నాని, శ్రీశైలంలో 800 అడుగుల మట్టం వద్దే తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తరలించడం, పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై బాబు వైఖరి ఏంటి అని అడిగారు. అలాగే గతంలో తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి నోరు తెరవనందుకు మీకు ఏ శిక్ష వేయాలి? అంటూ నాని లాజిక్ లేకుండా మాట్లాడేశారు.
అసలు నీటి వివాదం కావాలనే తెరపైకి తీసుకొచ్చి జగన్, కేసీఆర్‌లు డ్రామా ఆడుతున్నారని ప్రజలకు అర్ధమైందని, అసలు ఎప్పటినుంచో తెలంగాణ నీటిని తోడుకుంటుంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎందుకు హడావిడి చేస్తుందో ప్రజలకు తెలుసని అంటున్నారు. ఓటుకు నోటు కేసులో బాబు పేరు లేదని, ఇక తెలంగాణలో ఆస్తులు ఉండటం వల్ల భయపడి జగన్‌తో సహ ఏపీ మంత్రులు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం అనలేక ఇప్పుడు బాబుపై పడి ఏడుస్తున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు పేర్ని కూడా లాజిక్ లేకుండా ఎదురుదాడి చేసి అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు.
Discussion about this post