రాజకీయాల్లో ఎప్పుడు యువతకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలి. వాళ్ళని ప్రోత్సహిస్తేనే రాజకీయ పార్టీలకు బలం పెరుగుతుంది. తెలుగుదేశం ఆవిర్భావించిన సమయంలో రాజకీయాల్లోకి యువత పెద్ద ఎత్తున వచ్చింది. ఎన్టీఆర్…యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సైతం, యువతని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు.
అలా యువతకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం యువత ఓట్లే. ఆ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. దీంతో ఆ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. పైగా జగన్ పార్టీలో యువ నాయకులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఎన్నికల్లో యువ ఎమ్మెల్యేలు బాగానే గెలిచారు.కానీ టీడీపీలో ఆ పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఇప్పుడు యువత సపోర్ట్ కావాలి. చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు పార్టీలో యువతకు పెద్ద పీఠ వేస్తామని, పార్టీలోకి కొత్త రక్తం ఎక్కిస్తామని చెబుతున్నారు. అయితే ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప, చేతల్లో ఉండటం లేదు. ఇప్పటికీ పార్టీలో యువతకు పెద్ద పీఠ వేసినట్లు కనిపించడం లేదు. అలాగే పార్టీలో యువ నాయకత్వం దూకుడుగా పనిచేసే స్వేచ్చ కూడా ఇచ్చినట్లు లేరు.
అందుకే ఎప్పుడు పార్టీలో లోకేష్, రామ్మోహన్ నాయుడు లాంటి వారి మాత్రమే హైలైట్ అవుతున్నారు తప్ప, మిగతా నాయకులు హైలైట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. పేరుకు తెలుగు యువత ఉందిగానీ, దూకుడుగా పనిచేయడంలో వారు విఫలమయ్యారనే చెప్పొచ్చు. కాబట్టి పార్టీలోకి కొత్తవారిని తీసుకోవాల్సిన అవసరముంది. అదే సమయంలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తే, పార్టీకే లబ్ది జరుగుతుంది. లేదంటే ఎప్పుడు యువతకు పెద్ద పీఠ వేసుకుంటూనే వెళ్ళాలి.
Discussion about this post