ఏపీ-తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుంది. అటు తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ సైతం చంద్రబాబు చుట్టూనే రాజకీయాలు చేస్తుంది. అంటే రెండు అధికార పార్టీలకు చంద్రబాబు ప్రధాన శత్రువుగా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు అంటే ఇటు జగన్‌కు అటు కేసీఆర్‌కు అంత భయం ఎందుకు వేస్తుందో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమంగా కడుతున్నారని, దాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అలాగే తెలంగాణ మంత్రులు, జగన్ వైయస్సార్‌లపై విమర్శలు చేస్తున్నారు. ఏపీ మంత్రులు సైతం వాళ్లకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పలు అక్రమ ప్రాజెక్టులు కట్టిందని, శ్రీశైలం పులిచింతల వద్ద పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.అయితే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసమే నీటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ప్రతిపక్షాలు, పలువురు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఈ నీటి వివాదంలోకి చంద్రబాబుని లాగే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. రాయలసీమ ప్రాజెక్టుకు చంద్రబాబు అడ్డు పడుతున్నారని, అలాగే గతంలో తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడితే అడ్డుకోలేదని అంటున్నారు.అటు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి పిసిసి పదవి రావడానికి కారణం చంద్రబాబు అని, కాంగ్రెస్ ముసుగులో రాజకీయం చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని, హరీష్ రావు, కేటీఆర్‌లు విమర్శిస్తున్నారు. అలాగే రేవంత్, చంద్రబాబు మనిషి అని చెప్పి ఇటు ఏపీలోని వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే జగన్, కేసీఆర్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం జల వివాదాన్ని తీసుకొచ్చి జనాల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది. ఇందులో చంద్రబాబుని లాగి లబ్దిపొందాలని ఇటు వైసీపీ ప్రభుత్వం చూస్తుంది.
అలాగే చంద్రబాబు తెలంగాణలో ఎంట్రీ అయితే తమకు ఇబ్బంది అని చెప్పి టిఆర్ఎస్ రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకి సంబంధం ఉందని రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అంటే మొత్తం మీద చూసినట్లయితే అటు ఏపీ అధికారంలో ఉన్న వైసిపికి, ఇటు తెలంగాణ అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌కు చంద్రబాబు అంటే భయం లాగా ఉందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
Discussion about this post