తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు. దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఒక విధంగా చెప్పుకుంటే చక్కని అనుభవం అనుకోవాలి. కానీ మరో విధంగా చూస్తే అదే అతి పెద్ద మైనస్ గా ఉంది. టీడీపీలో రొడ్డ కొట్టుడు విధానాలే ఈ రోజుకీ అమలు అవుతున్నాయి. అవుట్ డేటెడ్ పాలిటిక్స్ నే చంద్రబాబు ఇంకా అమలు చేస్తున్నారు. చంద్రబాబు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసింది ఎర్లీ సెవెంటీస్ లో. మరి ఆనాడు ఎటువంటి సాంకేతికత లేని రోజులు. నాడు ఏదైనా చెబితే జనాలు ఇట్టే నమ్మేసేవారు. ఆ తరువాత చూస్తే ప్రింట్ మీడియా డామినేషన్ ఎక్కువగా ఉండేది. అలా లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న మీడియా అండదండలతో చంద్రబాబు పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇపుడు మాత్రం అలా కుదిరే వ్యవహారం అసలు లేదు. ఎందుకంటే ఇపుడు అంతా సోషల్ మీడియా యుగం.
ఏది చెప్పినా కూడా క్షణాల్లో జనాలకు చేరుతుంది. టెక్నాలజజీ పుణ్యమాని గతంలో అన్న మాటలు ఇపుడు చెప్పిన మాటలు అన్నీ కూడా మళ్లీ బయటకు వచ్చి ప్రశ్నిస్తాయి. అందువల్ల పాత పద్ధతిలో అవతల వారి మీద బురద వేసి రాజకీయంగా పై చేయి సాధిస్తామంటే జరగని పని. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అదే మూసలోనే ఉన్నారు. ఆయన జూమ్ యాప్ ముందర కూర్చుని జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తే అవి జనాలకు చేరిపోయి సర్కార్ మీద నెగిటివిటీ దారుణంగా పెరిగిపోతుందని ఆశిస్తున్నారు. కానీ అది నిజం కాదు, జనాలు కూడా అన్ని విషయాలూ బేరీజు వేసుకుంటున్నారు. ఒక విమర్శ వెనకాల ఏముంది, ఎవరి ప్రయోజనాలు ఎంతవరకూ అన్నది కూడా చూస్తున్నారు.
దాంతో టీడీపీ రెండేళ్ళుగా జనాలకు అనుకున్నంతలా చేరకపోవడానికి రొటీన్ పాలిటిక్స్ కారణం అంటున్నారు. చంద్రబాబు మాత్రం ఈ సంగతి ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. పైగా చంద్రబాబు తన ఏజ్ వారినే నాయకులుగా ఉంచుకుని వారినే పొలిట్ బ్యూరోలోకి తీసుకుని అంతా తాను అనుకున్నట్లుగానే కధ నడిపిస్తున్నారు. టీడీపీ ఒక విధంగా వృద్ధ పార్టీ. ఆ పార్టీలో సీనియర్లు అంతా చూస్తే డెబ్బైలు దాటిన వారే ఉన్నారు. ఇందులో చాలా మందికి జనాలతో కనెక్షన్లు ఎపుడో కట్ అయ్యాయి. అయినా వారు జూమ్ యాప్ ముందు కూర్చుని చంద్రబాబు చెప్పిందే భేష్ అంటూంటారు. గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలియని వారి వల్లనే తెలుగుదేశం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని అంటున్నారు. మరి బాబు ఇకనైనా కొత్త కానెప్టులతో ముందుకు వస్తారా అని పార్టీ మేలు కోరేవారు ఎదురుచూస్తున్నారు.
Discussion about this post