ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాలయ్య-పవన్ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా బాలయ్య హోస్టుగా ఉన్న ఆహా అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. మామూలుగా వీరికి కేవలం సినీ ఇండస్ట్రీతోనే పరిచయాలు ఉంటే ఇంత ఎత్తున ప్రచారం వచ్చేది కాదు..కానీ వారు పోలిటికల్ రంగాల్లో కూడా ఉన్నారు. బాలయ్య ఏమో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు..హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు.

ఇక అన్నిటికంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం ఉంది. ఇప్పటికే చంద్రబాబు-పవన్ ఓ సారి కలిశారు. ఇప్పుడు బాలయ్య-పవన్ కలిసి షో చేస్తున్నారు. దీంతో ఇది రాజకీయంగా చాలా అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ షోపై వైసీపీ విమర్శలు కూడా చేస్తుంది. బాబు-పవన్ కలిసే ఉన్నారని, ఇప్పుడు బాలయ్యతో కలిశారని..వీరి బంధం ఓపెన్ అయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎంతమంది కలిసొచ్చినా జగన్ సింగిల్ గానే వస్తారని అంటున్నారు.

అయితే బాలయ్య-పవన్ కాంబో రాజకీయాల్లో టీడీపీ-జనసేన పొత్తుకు మరో అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. పైగా ఇప్పటివరకు పొత్తు అంటే రెండు పార్టీల కార్యకర్తలు కలిసేలా రాజకీయం ఉంటుందని అనుకోవచ్చు. ఇప్పుడు బాలయ్య-పవన్ కలవడం వల్ల..నందమూరి-మెగా అభిమానులు కూడా ఏకమవుతారని తెలుస్తోంది. ఏపీలో ఈ రెండు ఫ్యామిలీలకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లు కూడా చాలా కీలకమని చెప్పవచ్చు. ఇప్పుడు ఆహా షో వల్ల..ఇద్దరు ఫ్యాన్స్ కలిసే అవకాశం కూడా వచ్చింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. అప్పుడు రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ కలిశారు. ఇప్పుడు బాలయ్య-పవన్ కలయికతో మరింతగా వారి బంధం బలపడే ఛాన్స్ ఉంది.

Leave feedback about this