తెలుగుదేశం పార్టీలో బాలయ్యకు ఎంత ప్రాధాన్యత ఉంటో చెప్పాల్సిన పని లేదు. ఆయన చెబితే చాలామందికి సీట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా తన ఫ్రెండ్ కదిరి బాబూరావుకు కూడా బాలయ్య సీటు ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో బాబూరావుకు, కనిగిరి టికెట్ ఇప్పించారు. ఇక ఆ ఎన్నికల్లో బాబూరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా బాబూరావు ఐదేళ్ల పాటు అద్భుతమైన పనితీరు ఏమి కనబర్చలేదు.

అసలు 2019 ఎన్నికలోచ్చేసరికి బాబూరావుకు మళ్ళీ టికెట్ ఇవ్వొద్దని కనిగిరి టీడీపీ శ్రేణులు ఆందోళనలు కూడా చేశాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు…కాంగ్రెస్ నుంచి వచ్చిన ముక్కు ఉగ్రనరసింహకు కనిగిరి సీటు ఇచ్చి, బాబూరావుకు దర్శి టికెట్ ఇచ్చారు. అటు దర్శిలో ఉన్న శిద్ధా రాఘవరావుని ఒంగోలు ఎంపీగా నిలబెట్టారు. జగన్ వేవ్‌లో ముగ్గురు నేతలు ఓడిపోయారు. ఇలా ఓడిపోయాక శిద్ధా..తన కుమారుడుతో కలిసి వైసీపీలోకి వెళ్ళిపోయారు.

ఇక బాలయ్య ఫ్రెండ్ బాబూరావు కూడా టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ కొట్టారు. అయితే వైసీపీలోకి వెళ్ళాక బాలయ్య ఫ్రెండ్ ఏమైపోయారో అసలు కనబడట్లేదు. అసలు రాజకీయాల్లోనే ఆయన కనిపించడం లేదు. అలాగే జగన్ కూడా బాబూరావుకు ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో ఈయనకు సీటు కూడా ఇవ్వరని తెలుస్తోంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఏ సీటు ఖాళీ లేదు.

కనీసం టీడీపీలోనైనా ఉంటే దర్శి సీటు బాబూరావుకు ఉండేది. కానీ టీడీపీని వీడి బాబూరావు…రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. ఒకవేళ బాబూరావు మళ్ళీ టీడీపీలోకి వచ్చిన పెద్ద ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. ఈ సారి పార్టీలోకి వస్తే బాలయ్య కూడా హెల్ప్ చేయలేరు. ఏ

Discussion about this post