ఏపీ రాజకీయాల్లో బ్లూ మీడియా ఎప్పుడు ఎలా కథనాలు ఇస్తుందో అర్ధం కాకుండా ఉంది. ఈ బ్లూ మీడియా జగన్ ప్రభుత్వానికి భజన చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఎంతసేపు కావాలంటే అంత సేపు భజన చేసుకుంటూ, జగన్‌ని ‘గ్రేట్’ అంటూ పొగడటంలో తప్పులేదని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే చెబుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీపై నిత్యం విమర్శలు చేస్తూ, పార్టీకి కులాన్ని అంటగడుతూ, ఆ బ్లూ మీడియా పైశాచిక ఆనందం పొందుతుందని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.
అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఏ విషయంలోనైనా కులాన్ని తీసుకొచ్చి చంద్రబాబుపై రుద్ది ఆ బ్లూ మీడియా చేసే అకృత్యాలకు అంతుపోంతూ లేకుండా పోతుందని అంటున్నారు. తాజాగా కూడా బాలకృష్ణపై ఆ బ్లూ మీడియా అర్ధంపర్ధం లేని కామెంట్లు చేసిందని, అసలు ఆయన మాట్లాడిన మాటలకు టీడీపీకి లింక్ పెట్టి, పార్టీని నెగిటివ్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించి ‘మా’ ఎన్నికలు వాడివేడిగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు విష్ణు సైతం పోటీలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు.అలాగే ‘మా’ బిల్డింగుని తన సొంత ఖర్చులతో నిర్మిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై బాలయ్య స్పందిస్తూ, విష్ణు బిల్డింగ్ కడతాను అంటే, అందులో తాను భాగస్వామిని అవుతానని చెప్పారు. అంతే ఇంకా ఆ బ్లూ మీడియా, విష్ణు తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తే అని, అందుకే బాలయ్య సపోర్ట్ ఇచ్చారని, ఆ బ్లూ మీడియా సోది అంతా చెప్పుకొచ్చింది.
ఇక దీన్ని రాజకీయంగా టీడీపీకి ముడిపెట్టింది. బాలయ్య బిల్డింగుకు సాయం చేస్తానంటే అందులో కమ్మ వర్గాన్ని ఎందుకు తీసుకొచ్చిందో, బ్లూ మీడియాకే తెలియాలి. అలా అంటే మంచు ఫ్యామిలీ జగన్‌కు మద్ధతుగా ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ ఇస్తే బాలయ్య, జగన్‌కు సపోర్ట్ ఇచ్చినట్లేనా అని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.
Discussion about this post