ఏపీ రాజకీయాల్లో బీసీ ఓటర్లు చాలా కీలకంగా ఉంటారనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీల గెలుపోటములని బీసీలే డిసైడ్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయం. అయితే దశాబ్దాల పాటు బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు టీడీపీకి అండగా ఉంటూ వచ్చారు.
కానీ గత ఎన్నికల్లో బీసీలు జగన్‌కు మద్ధతు ఇచ్చారు. ఎన్నికల ముందు బీసీలకు కిరీటాలు పెడతాను అన్నట్లుగా జగన్ మాయమాటలు చెప్పడంతో ఆ వర్గాలు వైసీపీని గెలిపించాయి. కానీ గెలిచి అధికారంలోకి వచ్చాక జగన్ బీసీలకు ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. అయితే పేరుకు మాత్రం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది.
కానీ ఈ కార్పొరేషన్ వల్ల ఒక్క బీసీకు కూడా మేలు జరగడం లేదు. అసలు కార్పొరేషన్ డబ్బులు పథకాలకు మళ్లిస్తూ బీసీలని మోసం చేస్తూ వచ్చారు. ఇక పథకాలు అన్నీ ప్రభుత్వాల మాదిరిగానే జగన్ ప్రభుత్వం ఇస్తుంది. ఇంతవరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా వర్గాలని ఆర్ధికంగా ఆదుకోలేదు. ఇలా బీసీలని ఓటు బ్యాంక్‌గా వాడుకున్న జగన్…ఇప్పుడు అదే బీసీలతో మాట్లాడటానికి సమయం కూడా ఇవ్వడం లేదు.
తాజాగా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్ మీటింగ్ పెట్టారు. సీఎం ఉండాల్సిన స్థానంలో సలహాదారు బీసీలపై పెత్తనం చేయడానికి చూశారు. కనీసం బీసీలతో మాట్లాడటానికి కూడా జగన్‌కు ఖాళీ లేదంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా అని ఈయన ఏమి ప్రజల్లోకి రావడం లేదు. మీటింగ్ కూడా వర్చువల్‌గానే జరిగింది. అయినా సరే జగన్ హాజరు కాలేదు. దీని బట్టే జగన్‌కు బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు. బీసీలతో మాట్లాడటానికే సమయం ఇవ్వలేని జగన్‌కు, బీసీల ఓట్లు మాత్రం కావాలి.
Discussion about this post