కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంట్ ..తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే స్థానం. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఈ స్థానంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఒక చోటే గెలిచింది. మిగిలిన ఆరు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే బెజవాడ పార్లమెంట్ స్థానం టీడీపీనే గెలుచుకుంది.
అయితే ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత పెరిగింది. అధికారంలో ఉండటంతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలవగలిగింది గానీ, లేదంటే ఈ పార్లమెంట్‌లో వైసీపీకి అంత సీన్ లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే పలు స్థానాల్లో టీడీపీ పుంజుకుందని అంటున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ స్థానంగా ఉన్న విజయవాడ తూర్పులో టీడీపీ బలంగానే ఉంది. ఇక్కడ గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్‌గా ఉన్నారు.అటు 25 ఓట్లతో ఓడిపోయిన బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో పుంజుకున్నారు. మైలవరంలో దేవినేని ఉమా మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేశారు. నందిగామలో సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్యలకు అనుకూల పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నిత్యం ప్రజల్లోనే ఉంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే విజయవాడ వెస్ట్‌లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. జలీల్ ఖాన్ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. లేదంటే ఇక్కడ టీడీపీకి పట్టు దొరికేది అంటున్నారు.
అటు గత నాలుగు పర్యాయాల నుంచి ఓటమి పాలవుతూ వస్తున్న తిరువూరులో టీడీపీకి అనుకూల పరిస్తితి వస్తుంది. తాజాగా చంద్రబాబు, తిరువూరు ఇన్‌చార్జ్‌గా శావల దేవదత్‌ని నియమించారు. ఈయన దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. మొత్తానికైతే బెజవాడ పార్లమెంట్‌లో సైకిల్ స్పీడ్ పెరిగిందనే చెప్పొచ్చు.
Discussion about this post