రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ బెజవాడలో ఈ సారి ఎన్నికల పోరు హోరాహోరోగా జరిగేలా ఉంది. ఎప్పుడు కూడా రాజకీయ యుద్ధం హోరాహోరీగానే ఉంటుంది. ఈ సారి మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని రాజకీయ సమీకరణాలు పోరుని మరింత రసవత్తరంగా మార్చే ఛాన్స్ ఉంది. విజయవాడ నగర పరిధిలో మూడు సీట్లు ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లు ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఈస్ట్ తప్ప…మిగిలిన రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. సెంట్రల్ లో 25 ఓట్లు, వెస్ట్ లో 7 వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అలా బెజవాడపై వైసీపీ పై చేయి సాధించింది. కానీ ఈ సారి వైసీపీకి ఆ ఛాన్స్ ఉండే ఛాన్స్ లేదు. ఇప్పటికే వైసీపీకి యాంటీ ఉంది. ఒక ఈస్ట్ తప్ప మిగిలిన సీట్లలో వైసీపీకి యాంటీ ఉంది. టిడిపి బలపడుతుంది. అదే సమయంలో టిడిపి, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. దీంతో వైసీపీకి మరింత రిస్క్. టిడిపి, జనసేన మూడు సీట్లు గెలుచుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే మూడు సీట్లలో టిడిపి స్ట్రాంగ్..అలాగే జనసేనకు మంచి ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో వెస్ట్ లో టిడిపి వైసీపీ చేతిలో 7 వేల ఓట్ల తేడాతో ఓడింది. అక్కడ జనసేనకు 22 వేల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు టిడిపి, జనసేన కలిస్తే వెస్ట్ లో వైసీపీ గెలుపు గగనం. ఇక సెంట్రల్ లో వైసీపీ 25 ఓట్ల తేడాతోనే గెలిచింది. ఇక్కడ జనసేన సపోర్ట్ లేకుండానే టిడిపి…వైసీపీకి చెక్ పెట్టవచ్చు. కానీ జనసేనకు ఇక్కడ 30 వేల ఓటు బ్యాంకు ఉంది. అవి కలిస్తే టిడిపికి భారీ మెజారిటీ.
అటు ఈస్ట్ లో టిడిపి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు అక్కడ కాస్త వైసీపీ బలపడింది. అదే సమయంలో అక్కడ జనసేనకు 30 వేల ఓట్లు ఉన్నాయి. అంటే టిడిపి, జనసేన కలిస్తే ఈస్ట్ లో కూడా వైసీపీ గెలుపు కష్టమే.