విజయవాడలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఇంకా తగ్గలేదా? అంటే అబ్బే ఇప్పటిలో తగ్గేలా కనిపించడం లేదనే టీడీపీ శ్రేణుల నుంచి సమాధానాలు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ విభేదాలతోనే గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఓటమి పాలైంది.
కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కేశినేని నాని దూకుడుగా, బుద్దా-బోండా ఉమాల లక్ష్యంగా విమర్శలు చేశారు. దీంతో ఉమా-బుద్దాలు సైతం మీడియా సమావేశం పెట్టి మరీ కేశినేనిపై విమర్శలు చేశారు. ఇలా నాయకుల మధ్య జరిగిన రచ్చకు బ్రేక్ వేయాలని, అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ప్రయత్నం చేశారు. కేశినేని కుమార్తె శ్వేత సైతం బుద్దా-బోండాలని కలిసి విభేదాలని చల్లార్చే ప్రయత్నం చేశారు.కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కార్పొరేషన్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఎన్నికలయ్యాక నాయకులు కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడుప్పుడే రచ్చ మొదలవుతుందని తెలుస్తోంది. టీడీపీ తరుపున గెలిచిన 14 మంది కార్పొరేటర్లలో 6 మంది బోండా-బుద్దాకు మద్ధతుగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే బుద్దా-బోండా-నాగుల్ మీరా-కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌లు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ, కేశినేనికి చెక్ పెట్టడానికి చూస్తున్నారని తెలుస్తోంది.
ఇలా బుద్దా వర్గం వైపు పనిచేస్తుంటే మరో వైపు కేశినేని నాని, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్‌లు ఒక వర్గంగా నడుచుకుంటున్నారు. వీరు సెపరేట్‌గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇలా నేతల మధ్య సమన్వయం లేకపోతే భవిష్యత్‌లో పార్టీకే పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉందని సొంత పార్టీ శ్రేణులే భయపడుతున్నాయి. కాబట్టి అధినేత చంద్రబాబు కలుగజేసుకొని, బెజవాడలో రచ్చకు బ్రేక్ వేయాలని అంటున్నారు. లేదంటే బెజవాడలో టీడీపీ మునగడం ఖాయమని చెబుతున్నారు.
Discussion about this post