కర్నూలు జిల్లా నందికొట్కూరు పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నా సరే, ప్రజలకు బైరెడ్డి పేరే ఎక్కువ గుర్తుస్తోంది. ఎందుకంటే అంతలా నందికొట్కూరుపై బైరెడ్డి పట్టు తెచ్చుకున్నారు. అయితే గతంలో నందికొట్కూరు అంటే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు గుర్తొచ్చేది. ఆయన టిడిపిలో ఉండగా నియోజకవర్గంలో మంచి విజయాలే సాధించారు. అయితే ఆ తర్వాత నుంచే రాజకీయాలు మారిపోయాయి.

2009లో ఇది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంగా మారడంతో ఇక్కడ టిడిపి విజయం సాధించడం గగనమైపోయింది. పైగా బైరెడ్డి రాజశేఖర్ సైతం టిడిపిని వీడటంతో నియోజకవర్గంపై పట్టు తగ్గిపోయింది. అటు బైరెడ్డి సోదరుడు కుమారుడు సిద్ధార్థ్ వైసీపీలోకి వెళ్ళడంతో నియోజకవర్గంలో వైసీపీ హవా మొదలైంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నా సరే ఆధిక్యం మాత్రం బైరెడ్డిదే అన్నట్లుగా పరిస్తితి ఉంది.

అందుకే ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డి అంటే పెద్దగా పడదు. ఆర్థర్, బైరెడ్డి వర్గాలకు ఎప్పుడు రచ్చ జరుగుతూనే ఉంటుంది. వీరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వైసీపీ అధిష్టానం సర్ది చెబుతున్నా సరే వీరి రచ్చ ఆగడం లేదు. అయితే ఈ వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టిడిపి ఉంది.

అసలు ఇక్కడ టిడిపికి సరైన నాయకుడు లేరు. మాజీ ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఇంచార్జ్ విక్టర్‌లు ఎప్పుడో వైసీపీలోకి జంప్ కొట్టేశారు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన బండి జయరాజు అడ్రెస్ లేరు. ఇలా నియోజకవర్గంలో టిడిపికి దిక్కు లేకుండా పోయింది. ఇప్పటికీ అక్కడ చంద్రబాబు ఇంచార్జ్‌ని పెట్టలేదు. భవిష్యత్‌లో ఇంచార్జ్‌ని పెట్టిన నందికొట్కూరులో సైకిల్ నిలబడటం కష్టమే అని తెలుస్తోంది.

Discussion about this post