బొజ్జల గోపాలకృష్ణారెడ్డి….ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు.. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నేత. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల, టీడీపీలో అనేక పదవులు చేపట్టారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మధ్యలో అనారోగ్య కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో కూడా బొజ్జల పోటీకి దిగకుండా, తన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డిని కాళహస్తి బరిలో దింపారు.

కానీ జగన్ వేవ్‌లో బొజ్జల వారసుడు భారీ మెజారిటీతో పరాజయం పాలయ్యారు. కాళహస్తిలో వైసీపీ తరుపున బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు. ఇలా బొజ్జలకు కంచుకోటగా ఉన్న కాళహస్తి వైసీపీ వశమైంది. అయితే ఎమ్మెల్యేగా బియ్యపు తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక కాళహస్తికి ప్రభుత్వ పథకాలు మినహా, కొత్తగా ఒరిగిందేమీ లేదు.

అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. పైగా ఎమ్మెల్యే ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ట్రాక్టర్లతో ర్యాలీ చేసి జాతీయ మీడియాకి ఎక్కారు. ఆ తర్వాత కూడా బియ్యపు అనేక వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. పైగా మొన్న ఈ మధ్య నవరత్నాల పేరుతో జగన్‌కు గుడి కట్టిస్తూ, కాస్త హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ హడావిడి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదనే చెప్పొచ్చు. ఇక వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సుధీర్ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్నా సరే నిదానంగా బయటకొచ్చి, కాళహస్తిలో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టేందుకు చూస్తున్నారు. ప్రజల సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. ఇలా సుధీర్ దూకుడుగా పనిచేయడంతో కాళహస్తిలో టీడీపీ కాస్త పికప్ అయినట్లే కనిపిస్తోంది. కానీ బియ్యపుకు చెక్ పెట్టాలంటే సుధీర్ ఇంకా కష్టపడాల్సిన అవసరముంది. వచ్చే ఎన్నికల్లోపు బియ్యపుని డామినేట్ చేసే రేంజ్‌కు వెళితేనే బొజ్జల సుధీర్‌కు ఈ సారైనా గెలిచే అవకాశం దక్కుతుందని చెప్పొచ్చు.

Discussion about this post