కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన జిల్లా..పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జిల్లాలో పార్టీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే కృష్ణా ప్రజలు వైసీపీని గెలిపించారు. జిల్లాలో 16 స్థానాల్లో వైసీపీ 14 గెలవగా, టీడీపీ రెండు మాత్రమే గెలిచింది. టీడీపీ తరుపున గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఇలా వైసీపీని భారీగా గెలిపించిన కృష్ణా ప్రజలు ఇప్పుడుప్పుడే జగన్ ప్రభుత్వం వల్ల ఒరిగేదెమి లేదని తెలుసుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రజలు టీడీపీకి అనుకూలంగా మారుతున్నారు. పైగా నిత్యం ప్రజల కోసం కష్టపడుతున్న టీడీపీ నేతలకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలా రెండేళ్లలోనే టీడీపీకి ప్లస్ అవుతున్న నియోజకవర్గం పెనమలూరు.
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున పార్థసారథి విజయం సాధించారు. టీడీపీ నేత బోడే ప్రసాద్‌పై 11 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా సారథి గొప్పగా ఏమి పనిచేయడం లేదు. గతంలో బోడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టించారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని సంబంధం లేకుండా అందరికీ అండగా నిలబడ్డారు. రోడ్లని అభివృద్ధి చేశారు. పైగా విజయవాడ నగరానికి దగ్గరగా ఉండటంతో పెనమలూరు టీడీపీ హయాంలో వేగంగా అభివృద్ధి జరిగింది. అటు ప్రభుత్వ పథకాలు కూడా బాగానే అందేవి.కానీ వైసీపీ వచ్చాక అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పటికే రాజధాని తరలింపు పేరుతో విజయవాడలో అభివృద్ధి ఆగిపోయింది. ఇక పథకాలు సొంత పార్టీ వాళ్ళకే వస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యే సారథి ఇసుకలో తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారని బోడే ప్రసాద్ ఆరోపిస్తున్నారు. అటు పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల్లో కూడా సారథి కోట్లు దండుకున్నారని అంటున్నారు. దాదాపు 50 కోట్లపైనే ఇళ్ల స్థలాల్లో అక్రమాలు చేశారని చెబుతున్నారు.
ఇలా వైసీపీ ఎమ్మెల్యేపై నిత్యం పోరాటం చేస్తున్న బోడే, పెనమలూరు ప్రజలకు అండగా ఉండటంలో ముందుంటున్నారు. ప్రజల సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అయితే గతంలో బోడే చేసిన అభివృద్ధి, ఇప్పుడు వైసీపీ చేస్తున్న కార్యక్రమాలని పోల్చుకుంటే ప్రజలకు బోడేకే మళ్ళీ మద్ధతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికీ పెనమలూరులో బోడే హవా మొదలైందని చెప్పొచ్చు.
Discussion about this post