ఈ మధ్య అధికార వైసీపీకి అనుకూలంగా అనేక మీడియా సంస్థలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఏదో బెల్లం చుట్టూనే ఈగలు తిరుగుతాయి అన్నట్లు, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి అనేక మీడియా సంస్థలు భజన చేయడంలో ముందున్నాయి. అలాగే జగన్ చేసే తప్పులని కవర్ చేసుకోవడంలో కూడా ఆ మీడియా ముందుంటుంది. దీనికి తోడు ప్రభుత్వ సొమ్ముతో నడిపించుకుంటున్న వైసీపీ సోషల్ మీడియా కూడా అదే బాటలో ఉంది.
ఎప్పటికప్పుడు జగన్‌కు భజన చేయడం, అలాగే జగన్ చేసే తప్పులని కవర్ చేసి మా అన్న దేవుడు అని చెప్పుకోవడంలో వైసీపీ సోషల్ మీడియా ఉంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాని నడిపిస్తున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కింద పడిన పైచేయి మాదే అనే అంటాడు. అలాగే వైసీపీ అధిష్టానం ఇచ్చే సొమ్ముని పెద్ద మొత్తంలో వెనుకేసుకుని, పాపం సోషల్ మీడియాలో వైసీపీ కోసం కష్టపడుతున్న వైసీపీ కార్యకర్తలకు చిల్లర పడేస్తారు.అయితే ఇలా చిల్లర పనులు చేయడంలో ముందున్న దేవేందర్ రెడ్డికి, అతని బ్లూ మీడియాకి ఏబిఎన్ యాంకర్ కృష్ణ తాజాగా బుల్లెట్లు బాగా దించారు. జగన్ మీద అక్రమాస్తుల కేసులు కాకుండా, ఇతర చిన్నాచితకా కేసులు 11 ఉన్నాయి. ఉదాహరణకు… జగన్ ప్రతిపక్షంలో ఉండగా కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి అప్పట్లో పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అలాగే కలెక్టర్‌పై దుర్భాషలాడినట్లు జగన్‌పై కేసు నమోదైంది. ఇలా పలు కేసులు జగన్‌పై ఉన్నాయి.
ఇక వీటి అన్నిటికి లాక్‌డౌన్ సమయంలో జీవో జారీ చేసి కొన్ని కేసులు క్లోజ్ చేయించుకోగా, మరికొన్ని స్థానిక పోలీసులు క్లోజ్ చేశారు. గుట్టుచప్పుడు లేకుండా జరిగిన ఈ వ్యవహారం బయటకు రాగా, ఈ 11 కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ మొదలైంది. ఈ విషయాన్ని ఏబిఎన్ హైలైట్ చేసింది. అయితే మళ్ళీ ఏమన్నా చిక్కులు వస్తాయని చెప్పి ఏబిఎన్, ఆ వీడియోని డిలీట్ చేసిందని గుర్రంపాటి, బ్లూ మీడియా గగ్గోలు పెట్టాయి. ఏబిఎన్ ఆర్కే, యాంకర్ వెంకట కృష్ణలు భయపడ్డారని హడావిడి చేశారు.
Discussion about this post