ఎట్టకేలకు ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం కొనసాగింది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వన్‌సైడ్‌గా విజయాలు సాధించింది. అయితే ఈ ఎన్నికలని ప్రతిపక్ష టిడిపి బహిష్కరించిన విషయం తెలిసిందే. కానీ అంతకముందే నామినేషన్స్ వేయడంతో కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్ళు వైసీపీతో గట్టిగానే పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలోని దుగ్గిరాల మండలంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది.

ఆ మండలం పరిధిలో ఉన్న ఎంపిటిసి స్థానాల్లో టిడిపి సత్తా చాటింది. మొత్తం 18 ఎంపిటిసి స్థానాలు ఉండగా టిడిపి 9 స్థానాలు గెలుచుకుంది. ఇక జనసేన రెండుస్థానాలు గెలుచుకుంటే….అందులో ఒక స్థానమే గెలుచుకుందని ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించారు. ఇక జనసేన గెలిచిన పెదకొండూరులో రిజల్ట్ తారుమారైంది. మామూలుగా 10 ఓట్ల లోపు మెజారిటీ ఉంటే రీకౌంటింగ్ చేయాలి. కానీ పెదకొండూరులో జనసేనకు వైసీపీ మీద 67 ఓట్ల మెజారిటీ వచ్చింది అయినా సరే….అధికార పార్టీ ఒత్తిడితో మళ్ళీ కౌంటింగ్ చేశారు.

చివరికి జనసేనకు 3 ఓట్ల మెజారిటీ వచ్చింది…కానీ అధికారికంగా బోర్డు మీద వైసీపీ 21 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అధికారులు రాశారు. దీంతో జనసేన పార్టీ నేతలు షాక్ అయ్యారు. దీంతో వైసీపీ ఖాతాలో 8 ఎంపిటిసి స్థానాలు వచ్చి పడ్డాయి. ఇక దుగ్గిరాల ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవాలంటే 10 ఎంపిటిసి స్థానాలు కావాలి. కానీ టిడిపికి ఉన్నది 9. జనసేన సపోర్ట్ ఇస్తే ఎంపిపి స్థానం కైవసం చేసుకోవచ్చు.

అలా కాకుండా వైసీపీ..ఒక టిడిపి, ఒక జనసేన ఎంపిటిసిలని లాగేసుకుని ఎంపిపి స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వమని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ పలు రకాలుగా అక్రమాలు చేసి గెలిసింది….మరి ఇది కూడా అలాగే గెలుస్తుందేమో చూడాలి.

Discussion about this post