జాతీయ రాజకీయాల్లో జగన్ విధానం ఏంటో సొంత పార్టీ నేతలకే అర్ధం కావడం లేదు. జగన్ బీజేపీకి ఇప్పటిదాకా మద్దతు ఇస్తూ వచ్చారు. ఇపుడు చూస్తే పార్లమెంట్ లో ఆయన తన ఎంపీల చేత మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయిస్తున్నారు. రోజూ సభలో వైసీపీ ఎంపీలు గొడవలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఇతర విపక్షాలతో చేతులు కలుపుతున్నారా అంటే అంత సీన్ లేదు. వైసీపీ ఒంటరిగానే పోరాడుతోంద్. పార్లమెంట్ లో బీజేపీయేతర పార్టీలు అన్నీ కూడా కో ఆర్డినేషన్ చేసుకుంటున్నాయి. మోడీని ఎలా ఇరుకున పెట్టాలని వారు ఆలోచిస్తున్నారు. దానికి తగినట్లుగా ప్రతీ రోజూ సభలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటూ కొన్ని సార్లు కధ నడిపిస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని సార్లు లీడ్ తీసుకుంటోంది. జగన్ నేరుగా కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ఇష్టపడకపోతే మమతతో అయినా సయోధ్యకు ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆయన అలా చేయడంలేదు. దీంతోనే జాతీయ స్థాయిలో విపక్షాలకు జగన్ పోకడల మీద అనుమానాలు వస్తున్నాయిట. జగన్ నిజంగా మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోందిట.ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో అన్ని విపక్షాలను కలపాలని మమత ప్రయత్నం చేస్తోంది. అయితే జగన్ ని మాత్రం ఆమె కూడా పక్కన పెడుతున్నారుట. ఉంటే గింటే తన ఫ్రంట్ లో చంద్రబాబు ఉంటారని నమ్ముతున్నారుట. అయితే చంద్రబాబు ఇప్పటికి నోరు విప్పకపోయినా ఎన్నికలకు ఏడాది ముందు మోడీ మీద గట్టిగా విమర్శలు చేస్తూ విపక్ష శిబిరంలోకి దూకుతారు అంటున్నారు. ఈ
రెండేళ్ళు మాత్రం ఆయన సైలెంట్ గానే ఉంటారట. ఎందుకంటే మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాబుకు తెలియనిది కాదు. మొత్తానికి బాబుకు జాతీయ స్థాయిలో విపక్షలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ బీజేపీని మోడీని వ్యతిరేకిస్తే జగన్ కి ఎవరు ఉన్నారు అన్నదే చర్చ. జగన్ మరి ఇంతటి గందరగోళ రాజకీయంతో జాతీయ స్థాయిలో ఉంటే ఏపీకి ఏలా ప్రయోజనం కలుగుతుంది అన్నది విశ్లేషకుల మాటగా ఉంది.
Discussion about this post