రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసేవారు మళ్ళీ గెలవడం చాలా అరుదుగా జరుగుతుంది..ఏదో కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసొస్తుంది గాని మిగిలిన వారికి గెలుపు దక్కడం కష్టమవుతుంది. ఏపీలో గత ఎన్నికల్లో టిడిపి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు ముగ్గురు మాత్రమే గెలిచారు. అచ్చెన్నాయుడు, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులు గెలిచారు. మరి ఇప్పుడు వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎంతమంది గెలుస్తారంటే? చెప్పలేని పరిస్తితి.

ఇక మొదట విడతలో మంత్రులుగా చేసి..తర్వాత పదవులు కోల్పోయి మాజీ మంత్రులైన వారిలో ఎంతమంది గెలిచి గట్టెక్కుతారు? అంటే చెప్పడానికి లేదు. తొలి విడతలో మంత్రులుగా చేసిన వారు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆళ్ళ నాని, రంగనాథ రాజు, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, పుష్పశ్రీ వాణి, ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నారాయణ..వీరంతా మొదట విడతలో మంత్రులుగా చేసి..ఆ తర్వాత పదవులు కోల్పోయిన వారు.

మరి వీరిలో ఎవరికి గెలుపు అవకాశాలు కాస్త మెరుగా ఉన్నాయంటే..కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ తప్ప మిగతా వారందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారని చెప్పవచ్చు. గుడివాడలో నాన్, నర్సన్నపేటలో కృష్ణదాస్‌కు కాస్త పాజిటివ్ ఉంది. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తు ఉన్న వీరికి పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.

కానీ మిగిలిన మాజీ మంత్రులకు పెద్ద షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది.టిడిపి-జనసేన కాంబినేషన్‌లో మాజీ మంత్రులందరూ ఓటమి రుచి చూసేలా ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరూ బయటపడేలా లేరు. కొద్దో గొప్పో బాలినేనికే కాస్త అవకాశాలు ఉన్నాయి గాని..మిగిలిన వారంతా గెలుపు గుర్రం ఎక్కడం డౌటే అని తెలుస్తోంది.
