వైసీపీలో నెంబర్ 2 గా పిలవబడే ఎంపీ విజయసాయిరెడ్డి మాట తీరు కాస్త మారినట్లు కనిపిస్తోంది. తాజాగా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన, తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రతిపక్ష టిడిపిపై విమర్శలు చేసే విజయసాయి, కాస్త ఎమోషనల్‌గా మాట్లాడేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై భూ కబ్జా ఆరోపణలు రావడం బాధించాయని అన్నారు. తనకు విశాఖలో సెంటు భూమి కూడా లేదని, ఆస్తులు సంపాదించాలనే కోరిక తనకు లేదని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ప్రజలు గుర్తించాలని కోరారు.

అలాగే తన పేరు చెప్పుకునే ఎవరైనా భూ కబ్జాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే భవిష్యత్‌లో విశాఖలోనే స్థిరపడాలని, భీమిలిలో నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమిని కొనుకుని అందులో ఇల్లు కట్టుకుని, అక్కడే తనువు చాలించాలని అన్నారు. అసలు ఎప్పుడూలేని విధంగా విజయసాయి సరికొత్త వర్షన్‌లో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇదంతా తప్పులని కవర్ చేసుకోవడానికి విజయసాయి ఆడుతున్న ఎమోషనల్ డ్రామా అని టిడిపి శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి.

ఇక టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు అయితే విజయసాయి మాటల వెనుక అంతరార్ధం ఎంతో చెప్పే ప్రయత్నం చేశారు. ఆస్తులు సంపాదించాలనే కోరిక విజయసాయికి ఉందో లేదో, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెబితే బాగుంటుందని అయ్యన్న సెటైర్ వేశారు. అసలు ఉత్తరాంధ్రలో సెటిల్‌మెంట్లు చేసేదే విజయసాయి అని, భీమిలిలో నాలుగు ఎకరాలు అంటే…ఎకరా రూ.50 కోట్లు అని, అంటే రూ.200 కోట్ల భూమికి విజయసాయి ఎసరు పెడుతున్నట్లు కనిపిస్తోందని అయ్యన్న ఆరోపించారు.

అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూకబ్జాలు పెరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీని వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని పెద్ద ఎత్తున టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలని కవర్ చేసుకోవడానికే విజయసాయి ఈ వర్షన్‌లో వచ్చారని టిడిపి నేతలు మాట్లాడుతున్నారు.

Discussion about this post