గత రెండు నెలలుగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేస్తానని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత మంచు విష్ణు తాను కూడా పోటీలో ఉంటానని చెప్పారు. ఆ వెంటనే హేమ, జీవితా రాజశేఖర్ పోటీ చేస్తామని చెప్పారు. ఆ వెంటనే సీనియర్ నటుడు సీవీఎల్ . నరసింహారావు తాను కూడా పోటీలో ఉంటానని చెప్పారు. దీంతో మా వార్ కాస్తా పంచ పాండవుల యుద్ధం అన్నట్టుగా మారింది. అయితే తాజాగా మా అధ్యక్షుడు నరేష్‌పై ఉపాధ్యక్షురాలు హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె టాలీవుడ్‌లో మా మెంబర్స్‌కు పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. హేమ వాయిస్ మెసేజ్‌పై నరేష్ తో పాటు జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హేమ ముమ్మాటికి తప్పు చేసిందని వారు ఫైర్ అయ్యారు. హేమ వ్యాఖ్యలపై ముందుగా స్పందించిన నరేష్ హేమపై చర్యలు తీసుకోవాలని తాము మా క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు.

హేమ మాట్లాడుతూ నరేష్ అధ్యక్షుడు అయ్యాక ఫండ్ రైజ్ చేయడం మానేసి మాలో ఉన్న రు. 5 కోట్లలో రు. 3 కోట్లు ఖర్చు పెట్టేశారని ఆరోపించారు. ఆయనే ఎన్నికలు పెట్టకుండా మళ్లీ మా అధ్యక్షుడు అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీనిపై జీవితా రాజశేఖర్ కూడా కౌంటర్ ఇచ్చారు. హేమ మాటలు పూర్తి తప్పుగా ఉన్నాయని… ఇలాంటి గందరగోళం ఎందుకు క్రియేట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇక హేమ చెపుతున్నట్టు పెట్టిన ఖర్చంతా మా ఇంట్లో పెళ్లికో.. నరేష్ ఇంట్లో పార్టీలు చేసుకోవడానికో వాడలేదని ఫైర్ అయ్యారు.

మరి వీరి విమర్శలకు హేమ నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుందో ? చూడాలి. ఇదిలా ఉంటే మా ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పుడు జీవిత కూడా నరేష్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. గత మా ఎన్నికలు ముగిసినప్పటి నుంచే వీరి మధ్య సఖ్యత లేదు. అలాంటప్పుడు ఇప్పుడు సడెన్‌గా జీవిత నరేష్‌నకు మద్దతుగా హేమకు కౌంటర్ ఇవ్వడంతో మా పరిణామాలు మారుతున్నాయని తెలుస్తోంది.

Discussion about this post