మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు రాజధాని కావాలని విశాఖ వాసులు కోరుకోలేదు. కానీ రాజకీయంగా టీడీపీని, అమరావతిని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వైసీపీ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చిందనే సంగతి తెలిసిందే. అలాగే విశాఖలో భూములని కూడా వైసీపీ నేతలు విపరీతంగా కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అయితే విశాఖలో వైసీపీకి రాజధాని డ్రామా వర్కౌట్ కాలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గానీ, అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. పైగా టీడీపీ కూడా ఎక్కువ డివిజన్లు గెలిచింది. ఇదే గాక విశాఖలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకిత కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత ఉన్న స్థానాల్లో టీడీపీకి లీడ్ దొరికినట్లు కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉంటే వైసీపీ 11 గెలుచుకోగా, టీడీపీ నాలుగు చోట్ల గెలిచింది. ఆ నలుగురు విశాఖ నగరంలోనే సీట్లు గెలుచుకుంది. ఇక ఇందులో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి వెళ్లారు. వైసీపీలోకి వెళ్ళిన వాసుపల్లిపై కూడా ప్రజల్లో వ్యతిరేకిత మొదలైనట్లు తెలుస్తోంది. అటు నర్సిపట్నంలో డైరక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు ఉమా శంకర్ గణేశ్‌పై కూడా తీవ్ర వ్యతిరేకిత వస్తుందట. ఇక్కడ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పుంజుకున్నారనే చెప్పొచ్చు.

అలాగే పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు అంత అనుకూల పరిస్తితులు కనిపిచడంలేదు. ఇక్కడ టీడీపీ నాయకురాలు అనిత పికప్ అయ్యారని తెలుస్తోంది. ఇక గాజువాకలో ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజ్, పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలపై కూడా వ్యతిరేకిత పెరిగిందట. మొత్తం మీద విశాఖలో టీడీపీకి కాస్త లీడ్ పెరిగినట్లే అని చెప్పొచ్చు.

Discussion about this post