గట్టిగా రెండేళ్ళు గడిచాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ రెండేళ్ళల్లో ఎడా పెడా అప్పులు చేసి పారేసింది. ఇవ్వని వాడితే పాపం అన్న తీరున అప్పులు తెచ్చి పంచుడు కార్యక్రమం షురూ చేశారు. ఇపుడు ఇంకా తెగించి భారీ వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులతో ఏదైనా ప్రాజెక్టులు కడతారా. ప్రణాళికా వ్యయంగా చూపిస్తారా అంటే అవేమీ కాదుట. ఈ అప్పులతో జీతాలు చెల్లించడానికి, పంచుడు కార్యక్రమానికేనట. విన్న వారు అనుమానం పడ్డా అశ్చర్యపడ్డా కూడా ఇదే నిజం.
ఏపీలో ఇపుడు రాష్ట్ర రధం అప్పుల మీద నడుస్తోంది. గతంలో అప్పులు తెస్తే దీర్ఘ కాలిక అవసరాలకు వాటిని ఉపయోగించేవారు. తెచ్చి వాట్లో చాలా వరకూ శాశ్వతమైన అభివృద్ధి పనులకు ఖర్చు చేసేవారు. తద్వారా ఆ అభివృద్ధి ఫలాలు కనుక వస్తే అసలు వడ్డీ రెండూ కూడా తీర్చేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇపుడు అలాంటి వాతావరణమే లేదు. అప్పు తెచ్చుకోకుండా పొయ్యిలో పిల్లి లెవడంలేదు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఖాతాల్లో నగదు పడక చాలా రోజులుగ ఆశగా ఎదురుచూస్తున్నారు.అటువంటి వారికి కనీసం పదవ తారీఖుకైనా జీతాలు వేయాలి కదా. దాని కోసం అన్ని వైపులా తిరిగితే భారీ వడ్డీలకు రెండు వేల కోట్ల రూపాయల అప్పు సర్కార్ కి పుట్టిందంట. ఇపుడు ఆ అప్పు తెచ్చి పప్పు కూడు వండుతారు అంటున్నారు. అంటే ఇది కేవలం జూలై నెలకు మాత్రమే అన్న మాట. మరి ఆగస్ట్ సంగతి అంటే అప్పుడు చూసుకోవాలి. అప్పు చేయడానికి వచ్చే నెల కూడా రెడీ కావాలి. ఇంకా 36 నెలల పాలన ఉంది.
మరి ఇపుడే ఇలా బండి కుంటుతూ కునుకుతూ ఉంటే ముందు నెలలు ఎట్టా గడిచేది అని ప్రభుత్వ వర్గాలే బేజారెత్తిపోతున్నాయి. అయినా సరే అప్పు చేయాల్సిందే. పంచుడు జరగాల్సిందే. మరి రేపటి రోజున భారీ వడ్డీలు ఇస్తామన్నా అప్పులు పుడతాయా. అలాగే ఇంతలేసి వడ్డీలకు అప్పులు తెస్తే తీర్చేది ఎవరు. ఈ రోజు పప్పు బెల్లాలు తింటున్న ప్రజలే సుమా..!
Discussion about this post