సినిమాల్లో సీనియర్ నటుడు మోహన్‌బాబుకు ఎంత పేరు ఉందో చెప్పాల్సిన పని లేదు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడుగా మోహన్ బాబుకు తిరుగులేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఈయన చేసే కార్యక్రమాలు ఏ మాత్రం ప్రజలు విశ్వసించేలా ఉండవు. పైగా జగన్ ఇబ్బందుల్లో ప్రతిసారి పోలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చి, రాజకీయాలని డైవర్ట్ చేయడం మోహన్ బాబుకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఈయన, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ఎలాంటి రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీమెబర్స్‌మెంట్ ఇవ్వలేదని రోడ్డు మీద పడుకుని మరీ హడావిడి చేసేశారు.

ఇక ఎన్నికల్లో జగన్ గెలిచాక మళ్ళీ అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. జగన్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో తాత్సారం చేస్తున్న కూడా మోహన్ బాబు మాట్లాడలేదు. కానీ జగన్ ప్రభుత్వం ఓ వైపు అప్పులతో మునిగిపోయింది. మరోవైపు పన్నులతో పేద ప్రజల నడ్డి విరిచేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మోహన్ బాబు మళ్ళీ పోలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చి…అసలు హెరిటేజ్ ఫుడ్స్ తనదే అని, అందులో ఎక్కువ షేర్లు తనవే అని చెబుతున్నారు.

అలాగే రాజకీయంగా తన మనసుని గాయపరిచింది చంద్రబాబే అంటున్నారు. అయితే ఇన్ని ఏళ్లలో ఎప్పుడు హెరిటేజ్ గురించి మాట్లాడని మోహన్ బాబు, ఇప్పుడు మాట్లాడుతున్నారంటే రాజకీయంగా ఏదో కుట్ర ఉందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. రాజకీయంగా మోహన్ బాబుని అందలం ఎక్కించిందే చంద్రబాబు అని, పోనీ మోహన్ బాబు అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే అయితే, అప్పుడే వేరే పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి గెలిస్తే తెలిసిపోయేదని చెబుతున్నారు.

అంటే పోలిటికల్‌గా జగన్‌పై ఉన్న నెగిటివిటీని పోగొట్టడానికి ఇప్పుడు కొత్తగా చంద్రబాబుపై లేనిపోని విమర్శలు క్రియేట్ చేయాలని మోహన్ బాబు చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక అయ్యప్పస్వామి సాక్షిగా ఈయన నటన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు కదా అని అంటున్నారు.
Discussion about this post