గట్టిగా రెండున్నరేళ్ళు కాలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోరమైన సీట్లు రావడం కూడా కళ్ళ ముందుంది. కానీ ఇంతలోనే వైసీపీ బంపర్ మెజారిటీ అలా సగానికి సగం పడిపోవడం అంటే వింతలోకెల్లా వింతే. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రెండేళ్ల పాటు కరోనా కారణంగా టీడీపీ పెద్దగా జనాల్లోకి వెళ్ళింది లేదు. మరో వైపు ఏపీలో జగన్ సంక్షేమ రధం కూడా ఎక్కడా ఆగలేదు. అంతా జగన్ కోరుకున్నట్లుగానే పాలన సాగుతోంది. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఇంత దారుణంగా సీట్ల నంబర్ తగ్గితే రేపటి రోజున అప్పులు పుట్టక సంక్షేమ పాలన ఆగిపోతే వైసీపీ సీన్ ఏంటి అన్నదే చర్చగా ఉంది. అంతే కాదు టీడీపీ విగరస్ గా జనాలలోకి వెళ్తే అపుడు జనాలు ఆ పార్టీకి అట్రాక్ట్ అయితే వైసీపీ ఎన్నో ప్లేస్ లో ఉంటుంది అన్నది కూడా చర్చగానే ఉంది.

ఒక విధంగా చెప్పాలి అంటే తాజాగా సర్క్యులేట్ అవుతున్న ఒక సర్వే మాత్రం వైసీపీ గుండెల్లో డేంజర్ బెల్స్ నే మోగిస్తోంది. ఈ సర్వే ప్రకారం అయితే అరవై మంది దాకా ఎమ్మెల్యేలు ఇంటి దారి పట్టనున్నారుట. మరి మరో ఏడాది గడిస్తే వీరికి మరో నలభై మంది చేరువ అయితే వైసీపీ సర్కార్ అవుట్ అంటున్నారు. ఇక టీడీపీకి ఈ రోజుకు 55 సీట్లు వస్తాయని కూడా సర్వే చెబుతోంది. అంటే ఏ రకమైన కష్టం పడకుండానే టీడీపీ కావాలి అన్న వారు వేసిన ఓటు అదన్న మాట.

ఇక చంద్రబాబు జనంలోకి వచ్చి వైసీపీ ఘోర వైఫల్యాలు ఎండగడితే అపుడు టీడీపీ గ్రాఫ్ ఎక్కడికో పోవడం ఖాయం అంటున్నారు. ఏపీలో చూసుకుంటే రెండే పార్టీలు, రెండే రాజకీయాలు. కాబట్టి ఓట్ల చీలిక అన్న ప్రశ్నే తలెత్తదు. ఇది బాబుకు అడ్వాంటేజ్ కాగా జగన్ కి మాత్రం పూర్తి మైనస్ అవుతుంది. ఏపీలో జనసేన పెద్దగా సౌండ్ చేయడంలేదు.
బీజేపీని జనం నమ్మడంలేదు. ఇక వచ్చే ఎన్నికల వేళ టీడీపీ సింగిల్ గా పోటీ చేసినా కూడా వంద సీట్లకు తక్కుగ కాకుండా గెలుచుకుంటుంది అని ఇపుడున్న అంచనాల బట్టి చెబుతున్నారు. మరి దీనికి బాబు చాణక్య రాజకీయం కూడా తోడు అయితే మాత్రం ఏపీలో ఫ్యాన్ రెక్కలు ఆగిపోయినట్లే అంటున్నారు.

Discussion about this post