టీడీపీ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నాయకులు, యువ నేతలు.. ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు కదా? అనే ధోరణితో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో పట్టున్న నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ కీలక నాయకుడు మాత్రం.. తన గెలుపును ఎవరూ ఆపలేరని.. టీడీపీ విజయాన్ని ఎవరూ నిలువరించలేరని.. ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని.. తన అనుచరులకు చెబుతున్నారు. `వచ్చే ఎన్నికల్లో మనదే గెలుపు` అంటూ.. ఆయన ప్రతి ఒక్కరికీ చెబుతున్నారట. దీంతో సదరు నేతపై ఆసక్తికర చర్చసాగుతోంది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నాయకుడు, కురుగొండ్ల రామకృష్ణ.. చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపు ఖాయమని అంటున్నారు. ఇటీవల జరిగిన నియో జకవర్గం స్థాయి సమావేశంలో ఆయన కార్యకర్తలను హుషారెత్తించారు. ప్రతి ఒక్కరూ మరింత కష్టపడాలని.. తన గెలుపు ఖాయమని.. ఆయన చెప్పారట. నిజానికి ఇది.. కాంగ్రెస్ సానుభూతి ఉన్న నియోజకవర్గం. 1994లో ఒక్కసారి మాత్రమే టీడీపీ విజయం దక్కించుకుంది. తర్వాత వరుసగా మళ్లీ కాంగ్రె స్ విజయం దక్కించుకుంది. అయితే.. ఇక్కడ పట్టుబట్టి.. టీడీపీకి కృషి చేశారు రామకృష్ణ. ఈ క్రమంలోనే ఆయన రెండుసార్లు విజయం సాధించారు.గత ఐదేళ్ల హయాంలో ఆయన ఇక్కడ బాగానే అభివృద్ధి చేశారు. పార్టీ కూడా అధికారంలో ఉండడం రామకృష్ణకు కలిసి వచ్చిం ది. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇప్పటికి ఆనం విజయం దక్కించుకుని రెండేళ్లు పూర్తయినా.. తట్ట మట్టి వేసింది లేదు.. ఒక్క కార్యక్రమం చేసింది లేదనే విమర్శలు జోరుగా ఉన్నాయి. ఆయన పదవుల వేటలో ఉన్నారని.. అది రాకపోవడంతోపాటు జిల్లాలో ఆధిపత్య రాజకీ యాలు పెరిగిపోయాయని.. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైసీపీలోను చర్చ సాగుతోంది. ఈ క్రమంలో నియోజక వర్గంలో అభివృద్ధిని ఆయన గాలికి వదిలేశారని ఇక్కడి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
ఈ పరిణామాలకు తోడు.. టీడీపీ కార్యకర్తలు నిజాయితీగా పార్టీలో ఉండడం.. తన హవాను తగ్గకుండా చూసుకోవడం.. వంటివి రామకృష్ణకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓట్లు చీలిన కారణంగానే తాను ఓడిపోయిన విషయాన్ని ముందుగానే గుర్తించిన రామకృష్ణ.. ఆయా వర్గాలను కలిసి.. తనకు అనుకూలంగా మార్చుకోవడం.. వారిలో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేయడం వంటివి చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఆయనలో ధీమా వ్యక్తమవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. ఆనం పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆయనను పార్టీలోను, జిల్లాలోనూ పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ విజయం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post