రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువా అన్నట్లు, ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం, వైసీపీ ప్రభుత్వానికి దెబ్బలు మీద దెబ్బలు పడేలా చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ గెలిచిన రఘురామ, అదే పార్టీ చేస్తున్న తప్పులకు వ్యతిరేకంగా గళం విప్పిన విషయం తెలిసిందే. ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్న దగ్గర నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే.
ఒకరకంగా రఘురామ, వైసీపీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా తమని ఇబ్బంది పెడుతున్న రఘురామపై వేటు వేయించాలని వైసీపీ ఎంపీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అనేకసార్లు స్పీకర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని పలుసార్లు రిక్వెస్ట్ చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంటున్నారు.కానీ రఘురామ మాత్రం, తాను పార్టీ చేస్తున్న తప్పులనే ఎత్తిచూపిస్తున్నానని, వైసీపీ ఎంపీలు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని, తనపై వేటు వేయొద్దని రఘురామ, స్పీకర్‌ని కోరుతున్నారు. మరి స్పీకర్ ఏం అనుకుంటున్నారో తెలియదుగానీ, రఘురామపై వేటు వేయడం లేదు. ఇదే అంశం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బలాగా ఉంది. ఈ సారి రఘురామపై వేటు వేయకపోతే పార్లమెంట్‌లో ఆందోళనకు దిగుతామని, స్పీకర్ పక్షపాత వైఖరితో ఉన్నారని చెప్పి ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇక ఇక్కడే మరోసారి వైసీపీ, రఘురామకు దొరికింది. స్పీకర్‌ని అలా విమర్శించడాన్ని తప్పుబట్టిన రఘురామ, ఆ పోరాటం ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సీఎం జగన్‌కే చెప్పారు. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, ఇతర హామీలు అమలు చేయాలని పోరాటం చేయకుండా, తనపై వేటు వేయాలని పోరాటం చేయడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఇలా చేసుకుంటూ వెళితే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశముందని కౌంటర్లు వేశారు. మొత్తానికైతే రాజుగారు, వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాకులే ఇస్తున్నారు.
Discussion about this post