జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేసేందుకు సిబిఐ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. బెయిల్ కండిషన్లని ఉల్లంఘిస్తున్నారని చెప్పి, జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక అనేక ట్విస్ట్‌లు తర్వాత బెయిల్ రద్దు పిటిషన్‌ని సిబిఐ కోర్టు కొట్టేసింది. సిబిఐ కోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. తమ నాయకుడు జైలుకు వెళ్ళడం లేదని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణంరాజుకు భారీ షాక్ తగిలింది. కోర్టులో ఓడిపోయినందుకు నైతిక బాధ్యతగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.

అయితే వైసీపీ శ్రేణులకు తనదైన శైలిలో రాజు గారు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. సిబిఐ కోర్టులో తన పిటిషన్ కొట్టేసినంత మాత్రాన తాను నిరుత్సాహపడటం లేదని, రెట్టించిన ఉత్సాహంతో హైకోర్టుకు వెళ్తున్నాని, అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీం కోర్టుకు వెళ్తానని రాజు గారు మాట్లాడుతున్నారు. కింది కోర్టులో ఓడినంత మాత్రాన తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, తన పరిపాలనలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు సుమారు 185 కేసుల్లో పరాజయం పాలైన సిఎం జగన్ మొదట రాజీనామా చేస్తేనే.. తానూ రాజీనామా చేస్తానని రాజు గారు కౌంటర్ ఇచ్చారు.

వాస్తవానికి చూసుకుంటే జగన్ అధికారంలోకి వచ్చాక, వారి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. అది కూడా చాలదు అన్నట్లు…సుప్రీం కోర్టులో కూడా జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక అంశంలో అని కాదు…అనేక అంశంల్లో జగన్ ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేశాయి. మరి అలాంటప్పుడు తాను ఒక్కసారి ఓడిపోతే ఎందుకు రాజీనామా చేస్తానని రాజుగారు, బ్లూ బ్యాచ్‌ని ప్రశ్నిస్తున్నారు.

Discussion about this post