రెండేళ్ళు అయినా కూడా జగన్ పాలన మీద పట్టు సాధించలేకపోతున్నారు. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా సవ్యంగా పాలించాలి అంటే కచ్చితంగా అధికారుల సహకారం అవసరం. జగన్ ఫుల్ సైలెంట్. ఆయన ఎక్కువ మాట్లాడరు. పైగా కొందరినే నమ్ముకుంటారు. అదే చివరికి కొంప ముంచుతోందన్న మాట అయితే ఉంది. జగన్ తన తరువాత అంతటి స్థాయి అనేలా ప్రవీణ్ ప్రకాష్ కి పెద్ద పీట వేశారు. ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిని సడెన్ గా ఇపుడు తప్పించేశారు. ముత్యాలరాజుని ఆ ప్లేస్ లోకి తీసుకున్నారు. మొత్తానికి జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఐఏఎస్ లలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. జగన్ దూకుడు పాలిటిక్స్ కి ఏ అధికారి కూడా అసలు సరిపోవడం లేదు అన్న మాట కూడా ఉంది.
అందుకే ప్రవీణ్ ని తప్పించేశారు అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రవీణ్ ప్రకాష్ వల్ల జగన్ కి లాభం ఎంత కలిగిందో తెలియదు కానీ ఆయనకూ ఇతర ఐఏఎస్ లకు అసలు సరిపడడంలేదు. ఒక విధంగా ఏపీలోని పాలన కొంత స్తబ్ధుగా మారిపోవడానికి ప్రవీణ్ ప్రకాష్ వైఖరి కూడా కారణమని అంటున్నారు. అలాగే అనేక తప్పుడు నిర్ణయాలు కూడా ఆయన హయాంలో జరిగాయని అంటున్నారు. అవే ఆయన వేటుకు కారణమని కూడా చెబుతున్నారు.
ఈ విషయాలు తెలుసుకోవడానికి జగన్ కి రెండేళ్ళు పట్టింది అంటున్నారు. అంటే మళ్లీ కధ మొదటికి వచ్చింది అని కూడా చెబుతున్నారు.
జగన్ సమర్ధులైన ఐఏఎస్ లు కావాలి. కానీ వారికి జగన్ ఆలోచనా విధానానికి పొత్తు కుదరడంలేదు అన్న మాట ఉంది. అందుకే గత రెండేళ్లలో చాలామంది అధికారులు ఇలా సన్నిహితంగా ఉంటూనే దూరమయ్యారు. ఇక జగన్ ప్రవీణ్ ప్రకాష్ బాగా దగ్గర. ఆయన్ని అసలు తప్పించరు అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. మొత్తం మీద జగన్ కత్తి పట్టుకుని ఉన్నారు. మరెంతమంది సీనియర్ అధికారులకు ఇపుడు వేటు పడుతుందో చూడాలి అంటున్నారు.
Discussion about this post