తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తక్కువ సమయంలో మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంపై కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు అసంతృప్తిగానే ఉన్నారు. కొందరు నేతలు ఈ విషయంపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో ఇలాంటి రాజకీయాలు మామూలే. పైగా అది వారి పార్టీకి సంబంధించిన విషయం.
కానీ ఈ విషయంలో కూడా ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తుత్తర ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అసలు రేవంత్‌కు పీసీసీ ఇప్పించిందే చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. అలాగే బాబు ఢిల్లీ పెద్దలని కొనేశారని, తెలంగాణలో కాంగ్రెస్ ఇక బాబు గ్రిప్‌లోనే ఉంటుందనే విధంగా మాట్లాడుతున్నారు. మామూలుగా రేవంత్-చంద్రబాబులకు మంచి అనుబంధమే ఉంది. ఒకప్పుడు రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు బాబు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రేవంత్ పార్టీ మారక బాబు, రేవంత్‌ల మధ్య రాజకీయ సంబంధాలు లేవు. కానీ వ్యక్తిగతంగా సత్సబంధాలు ఉన్నాయి.
ఇక రేవంత్ ఏదో రాజకీయంగా కష్టపడి పీసీసీ తెచ్చుకున్నారు. దానిపై కూడా విజయసాయిరెడ్డి కామెంట్లు చేస్తున్నారు. ఇలా కామెంట్లు చేయడం వల్ల విజయసాయి మానసిక ఆనందం పొందుతున్నారు ఏమో తెలియదు గానీ, దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ మంత్రులు, జగన్‌ని, వైఎస్సార్‌ని ఏ రేంజ్‌లో తిడుతున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు విజయసాయి, బాబు మీద పడి ఏడుస్తున్నారు.
అసలు వైఎస్సార్‌ని ఆ రేంజ్‌లో తిడుతున్న కూడా విజయసాయికి తెలంగాణ మంత్రులకు కౌంటర్లు ఇవ్వడానికి భయపడుతున్నట్లు ఉన్నారు. ఎందుకంటే జగన్‌తో సహ వైసీపీ నేతల ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి కాబట్టి, విజయసాయి ఆ విషయంలో నోరు మెదపకుండా, రేవంత్-చంద్రబాబులపై పనిమాలిన రాజకీయం చేస్తున్నారు.
Discussion about this post