ఏపీ రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్…ఈ ఫ్యామిలీకి రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. దివంగత పరిటాల రవీంద్ర ఓ మాస్ నాయకుడుగా తనదైన శైలిలో రాజకీయాలు చేసి ప్రజల మన్ననలని పొందారు. పేద ప్రజలకు అండగా ఉండటంలో రవీంద్ర ఎప్పుడు ముందేఉండేవారు. అందుకే అనంతపురం ప్రజల పాలిట దేవుడుగా తయారయ్యారు. ఇలా ప్రజలకు అండగా ఉన్న రవీంద్రని ప్రత్యర్ధులు ఎలా హత్య చేశారో కూడా అందరికీ తెలుసు.
రవి మరణంతో ఆయన భార్య సునీతమ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికలోచ్చేసరికి సునీతమ్మ పోటీ నుంచి తప్పుకుని తనయుడు శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలబెట్టారు. కానీ ఊహించని విధంగా శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి శ్రీరామ్ దూకుడుగా పనిచేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పార్టీని చాలావరకు బలోపేతం చేసుకుంటూ వచ్చారు.
అదే సమయంలో ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు కూడా శ్రీరామ్ చూసుకుంటున్నారు. ఇలా రెండు నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టడమే లక్ష్యంగా శ్రీరామ్ పనిచేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. శ్రీరామ్ ప్రభావం వల్ల రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గ పరిధిలో టీడీపీ బాగా పుంజుకుంది. నెక్స్ట్ ఎన్నికల్లో శ్రీరామ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.
అయితే సునీతమ్మని బరిలో దించాలని అనుకుంటే ధర్మవరంలో పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి, ఇంకాస్త కష్టపడితే ధర్మవరంలో టీడీపీ రేసులోకి వచ్చేస్తుంది. ఆ నియోజకవర్గంలో కూడా టీడీపీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే శ్రీరామ్ దూకుడుతో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో టీడీపీ రేసులోకి వచ్చింది. అయితే శ్రీరామ్‌ని రాష్ట్ర రాజకీయాల్లోకి కూడా తీసుకొస్తే పార్టీకి బెన్‌ఫిట్ అవుతుంది. పరిటాల ఫ్యామిలీకు ఉన్న ఫాలోయింగ్ పార్టీకి ప్లస్ అవుతుంది.
Discussion about this post