జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసేది ఒకటే…అది సంక్షేమ పథకాలు అందించడం…అర్హులైన ప్రజల బ్యాంక్ ఎకౌంట్లో ఏ పది వేలో, లేక పదిహేను వేలో డబ్బులు వేయడం అంతే..ఇంకా వేరే పని ఏమి చేస్తున్నట్లు లేదు. ఓ వైపు ప్రజలపై పన్నుల భారం మోపుతూనే, మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. ఇక జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఉదాహరణగా….రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్తితి కనిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు.

రోడ్లపై గొయ్యి ఉందో లేక నుయ్యి ఉందో ప్రజలకే అర్ధం కావడం లేదు. ఇక అవే రోడ్లపై వ్యవసాయం చేయొచ్చు…చేపలు పెంచవచ్చని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఈ గోతుల రోడ్ల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు. ఇక గోతుల రోడ్లపై ప్రతిపక్ష టిడిపి, జనసేనలు గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. వినూత్న రీతిలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.

అయితే ప్రతిపక్షాల నిరసనలకో లేక గోతులు ప్రభుత్వానికి కూడా కనిపిస్తున్నాయేమో గానీ జగన్ వెంటనే స్పందించినట్లు బ్లూ మీడియా వార్తలు ఇచ్చేస్తుంది. అలాగే వారం రోజుల్లో రోడ్ల మీద గుంతలు ఉండకూడదని సిఎం ఆదేశించారని కథనాలు ఇస్తుంది. కానీ అవి కథనాలు గానే మిగిలిపోతున్నాయి గానీ, రోడ్ల గుంతల కథలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఇక ఈ మధ్య బ్లూ మీడియా, బ్లూ మూక రోడ్లపై సరికొత్త రాజకీయం చేస్తున్నాయని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.

అదేంటి అంటే గుంతల పడిన రోడ్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేసినవి అంటా..నాసిరకం రోడ్లు వేయడం వల్లే గుంతలు పడ్డాయని బ్లూ మూక సరికొత్త ప్రచారం అందుకుంది. ఇక బ్లూ మూకకు టిడిపి శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. అంటే వైఎస్సార్ సిఎంగా ఉన్నప్పుడు..కాంగ్రెస్ పదేళ్ళ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లే వేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే చంద్రబాబు ఐదేళ్లలో అన్నీ రోడ్లు వేసేశారా? అని అడుగుతున్నారు. అయినా ఈ రెండేళ్లలో జగన్ ప్రభుత్వం ఎన్ని రోడ్లు వేసింది…ఎన్ని రోడ్లకు మరమ్మత్తులు చేసిందని ప్రశ్నిస్తున్నారు.

గతంలో కూడా వర్షాలు వచ్చాయని ఈ స్థాయిలో గుంతలు పడినట్లు ఎప్పుడు వినలేదని, కానీ ఈ రెండేళ్లలోనే రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, పైగా వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. కాబట్టి బ్లూ మూక రోడ్లపై ఎంత రాజకీయం చేసిన వర్కౌట్ అవ్వదు అంటున్నారు.

Discussion about this post