సింహం కడుపున సింహమే పుడుతుంది అంటారు. మరి నారా చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు భారత దేశాన మరొకరు ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. ఆయన గురించి ప్రత్యర్ధులు అయినా అంగీకరించే పరమ సత్యం. ఆయన కడుపున పుట్టిన లోకేష్ నాయకుడు కాకుండా ఎలా ఉంటాడు. నాయకత్వం అనేది నారా వారి రక్తంలోనే ఉంది. లోకేష్ కి ఏమీ తెలియదు అని ఆయన ఏమీ కాడని ప్రత్యర్ధులు వేయి విమర్శలు చేయవచ్చు కాక, నిజం తూర్పున ఉదయించే సూర్యుడు లాంటిది. అది మబ్బులను చీల్చుకుని వచ్చినట్లుగా అబద్దలా ప్రచారాని చీల్చుకుని మరీ లోకేష్ లోని నాయకుడు బయటకు వచ్చేశాడు.లోకేష్ లో చాలా మార్పు వచ్చింది అని అంతా అనుకుంటున్నారు.
మార్పు అనేది తెచ్చుకుంటే వచ్చేది కాదు, ఆయనది సహజ సిద్ధమైన వైఖరిని ఇపుడు క్యాడర్ చూస్తున్నారు. కర్నూల్ జిల్లాలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేసారు. అక్కడ పరామర్శకు వెళ్ళిన లోకేష్ బాబు మాట్లాడిన మాటలు కానీ ఆయన పేల్చిన డైలాగులు కానీ అధికార వైసీపీకి గట్టి హెచ్చరికగానే ఉన్నాయి. లోకేష్ ఇంతకాలం తన ఉన్నత విద్యార్హతలను దృష్టిలో ఉంచుకుని చాలా పద్ధతిగా రాజకీయాలు చేశారు. కానీ ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఆయనలోని మాస్ అప్పీల్ ని ఒక్కసారిగా చూపించేసరికి అధికార వైసీపీ నేతలకు గంగవెర్రులెత్తినట్లు అయింది.లోకేష్ కేవలం పది నిముషాల పాటు మీడియా ముందు మట్లాడిన మాటలకు టోటల్ టాప్ టూ బాటమ్ వైసీపీ షేక్ అయిపోయింది. మంత్రుల నుంచి సామంతుల వరకూ అందరూ పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు అంటే లోకేష్ సత్తా ఏంటి అన్నది అదే చాటి చెబుతోంది. గమ్మున ఉండలేకపోయారు అంటే లోకేష్ బాబు పేల్చిన బాంబుల్లాంటి డైలాగులు వారిని ఎంతలా భయపెట్టి ఉంటాయో కూడా అర్ధమైపోయింది. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి అంటూ లోకేష్ నేరుగా జగన్ కి చేసిన సవాల్ ని చూసిన టీడీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది కదా మాకు కావాల్సింది అంటూ తెగ మురిసిపోతోంది.
లోకేష్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీడీపీలో కొత్త హుషార్ కనిపిస్తోంది. మొత్తానికి అధికారం చేతిలో ఉంది కదా అంతా మా ఇష్టం అనుకుంటూ దూకుడు చేస్తున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు లోకేష్ బాబు జూలు విదిల్చారని కూడా కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇపుడే ఈ జోరు ఇలా ఉంటే మరో మూడేళ్ళలో జరిగే ఎన్నికల నాటికి లోకేష్ దూకుడుని వైసీపీ అసలు తట్టుకోలేదు అని కూడా పసుపు పార్టీ క్యాడర్ అంటోంది. మొత్తానికి టీడీపీకి సరైన టైమ్ లో లోకేష్ లాంటి యూత్ లీడర్ షిప్ అంది వచ్చిందని కూడా సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
Discussion about this post