టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్…ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ప్రతి సమస్యపైన ఆయన, ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఏదో ఒకరోజు ఆ సమస్య గురించి తప్పుకోవడం లేదు. దానిపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ ఎన్నిరోజులు పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. దేశంలో అన్నీ రాష్ట్రాలు కరోనాని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేస్తే, ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం పరీక్షలు రద్దు చేయలేదు.దీంతో లోకేష్ ఈ విషయంలో తీవ్రంగా పోరాడారు. ఎప్పటికప్పుడు విద్యార్ధులతో మాట్లాడుతూ, వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ పరీక్షలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ జగన్ ప్రభుత్వం మొండిగా పరీక్షలని నిర్వహించాలని చూసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం పరీక్షలని రద్దు చేసింది. అయితే విద్యార్ధుల కోసం పోరాడిన లోకేష్‌కు ఈ విషయంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
తమ కోసం నిలబడిన లోకేష్‌కు విద్యార్ధులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అలా పరీక్షల విషయంలో సక్సెస్ అయిన లోకేష్ ఇప్పుడు నిరుద్యోగుల కోసం గట్టిగానే పోరాడుతున్నారు. ఇటీవల జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట కేవలం 10 వేల ఉద్యోగాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందేమో 2 లక్షలపైనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు 10 వేలు ఉద్యోగాలు వదలడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి, 2 లక్షల ఉద్యోగాలు పెట్టి మరో క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నారా లోకేష్ సైతం ఈ విషయంలో నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ క్యాలెండర్ రద్దు చేసి, కొత్త క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బీఈడీ పూర్తి చేసి, ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరానికి చెందిన నాగేంద్ర ప్రసాద్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ, నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. ఆత్మహత్యలు వద్దు… ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసేలా సర్కారుపై ఒత్తిడి తెచ్చేలా పోరాడుదామని పిలుపునిచ్చారు. మరి నిరుద్యోగుల కోసం లోకేష్ చేసే ఈ పోరాటం కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
Discussion about this post