ఏపీలో రెండు నెలలుగా నలుగుతున్న ఒక అతి పెద్ద సమస్యను తనదైన శైలిలో టీడీపీ యువ నాయకుడు లోకేష్ పరిష్కరించారు. జగమొండి జగన్ని వంచిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ నెల మూడవ వారంలో లోకేష్ జగన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏపీలో కరోనా మహమ్మారి రెండవ దశ దారుణంగా ఉందని, అందువల్ల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రుల శ్రేయస్సును దృషిట్లో ఉంచుని ఇంటర్, టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని ఆ లేఖలో సూచించారు.
ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలలో పరీక్షలు చేశాయని కూడా ఆయన గుర్తు చేశారు. ఆనాడే వైసీపీ సర్కార్ ఈ మాట విని ఉంటే చాలా బాగుండేది. సర్కార్ పరువు కూడా నిలబడేది. కానీ అక్కడ ఉన్నది జగన్. అలా మొండి పట్టుదలకు జగన్ సర్కార్ పోయింది. లోకేష్ చెప్పాడు కాబట్టి తాము అసలు ఆ ప్ని చేయకూడదు అని భీష్మించుకుని కూర్చుంది. లోకేష్ కి పొలిటికల్ క్రెడిట్ వస్తుందని కూడా వింత వింత ఆలోచనలు చేసింది. నిజానికి టెన్త్ ఇంటర్ పరీక్షలు అంటే లక్షలాది మంది విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కలిపి అతి పెద్ద జన సమూహం సమస్య. ఈ విషయంలో పంతాలకు పోవడం పాలకుడు అన్న వారికి తగని పని.
తమ బుర్రకు తట్టలేదు అనుకుంటే ప్రతిపక్షాలు చెప్పిన మాట విన్నా తప్పులేదు. ఇందులో అవమానం అంతకంటే లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. లోకేష్ మీద కోపమా మరోటా తెలియదు కానీ రెండున్నర నెలల బట్టి టెన్త్ ఇంటర్ విద్యార్ధులకు ప్రత్యక్ష నరకమే చూపించింది. వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో నిద్ర లేని రాత్రులే గడిపారు. మొండిగా పరీక్షలు నిర్వహించి తీరుతామని తడవకోసారి ప్రభుత్వ పెద్దలు మీడియా ముందుకు వచ్చి ఇచ్చే ప్రకటనలతో అంతా పెద్ద ఎత్తున భీతిల్లారు. కరోనా వేళ ఎలా ఈ పరీక్షలను ఎదుర్కోవాలని కూడా తెగ ఆవేదన చెందారు.
మరో వైపు నారా లోకేష్ విద్యార్ధులు వారి తల్లిదండ్రులతో నిర్వహించిన జూమ్ యాప్ మీటింగ్స్ లో అభిప్రాయ సేకరణ చేస్తే మొత్తానికి మొత్తం విధ్యార్ధిలోకం పరీక్షలు రద్దు చేయడమే బెటర్ అని తేల్చి చెప్పేశారు. ఇక తల్లిదండ్రులు భయాలను కూడా గమనించిన లోకేష్ వారికి అభయమే ఇచ్చారు. తాను సర్కార్ పెద్దలతో పోరాడి అయినా పరీక్షలు రద్దు అయ్యేలా చూస్తాను అని మాట ఇచ్చారు. ఆ విధంగానే ప్రతీ రెండు రోజులకు ఒకమారు సర్కార్ పెద్దలను హెచ్చరిస్తూ అలెర్ట్ చేస్తూ లోకేష్ సుదీర్ఘమైన పోరే సాగించారు. మరో వైపు ఉపాధ్యాఉలు, తల్లిదండ్రులు,విద్యార్ధుల అభిప్రాయాలను కూడా రద్దుకు అనుకూలంగా కూడగట్టడంతో విజయవంతం అయ్యారు.
వీటితో పాటు న్యాయ స్థానాలు కూడా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టడంతో జగన్ సర్కార్ ఎట్టకేలకు తోక ముడిచింది అనే చెప్పాలి. పరీక్షలు రద్దు చేస్తున్నామని రెండు నెలల తరువాత ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం ఒక విధంగా తెలుగు దేశం పార్టీ సాధించిన ఘన విజయంగా చూడాలి. దానికి మించి లోకేష్ విజయంగానూ చూడాలి. మొత్తం మీద చూసుకుంటే లోకేష్ తన పోరాట పటిమతో యూత్ లీడర్ అయ్యారు. భావి పౌరుల అభిమానాన్ని సంపూర్ణంగా పొందారు. ఈ రోజు సర్కార్ పంతానికో టీడీపీ మీద ద్వేషంతో చేసిన పరీక్షల రాజకీయంలో ఫెయిల్ అయింది. దీని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో కూడా చవి చూస్తుంది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
Discussion about this post