ఫేక్ హామీలు ఇవ్వడం, ఫేక్ ప్రచారం చేయడం, ఫేక్ ఫోటోలు, వీడియోలు చేయడం వైసీపీకి సాధ్యమైనట్లు మరొకరికి సాధ్యం కాదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎందుకంటే టీడీపీని ఎలాగైనా దెబ్బతీయాలని వైసీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అనేక రకాలుగా వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు, నారా లోకేష్‌లపై విషప్రచారం చేయడానికి చూస్తుందని అంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫేక్ వీడియోలు పెట్టి చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్‌ల ఇమేజ్‌ని దెబ్బతీయడానికి చూశారని, కానీ ఈ సారి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి, చంద్రబాబుని దెబ్బకొట్టడానికి చూస్తున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత రేవంత్ రెడ్డి ఏబిఎన్, టివి5 మీడియా సంస్థ అధిపతులని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఏబిఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డిలు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్న ఓ వీడియోని మార్ఫింగ్ చేసి వైసీపీ మూక సోషల్ మీడియాలో పెట్టిందని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. వాళ్ళు ఇద్దరు లోకేష్ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారని, తాను లోకేశ్ కోసం ఎంతో తిరిగానని రాధాకృష్ణ చెబితే, అతన్ని క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పమని రేవంత్‌రెడ్డి సలహా ఇచ్చారని చెప్పి వైసీపీ మీడియా రాసింది. ఇక దీనికి తమ్ముళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఆ వీడియోలో వాయిస్ సరిగా వినిపించకపోయినా, వీరు మాత్రం మాటలు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టారని, ఒకవేళ అలాగే అనుకుంటే ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటల్లో తప్పులు ఏమి కనిపించడం లేదని చెబుతున్నారు.
కావాలనే వైసీపీ వాళ్ళు ఆ మాటలని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అసలు ఫేక్ ప్రచారం చేయడంలో వైసీపీ వాళ్ళ తర్వాతే ఎవరైనా అని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా ఇటీవల ఏపీలో అధికార పార్టీ నేతల ఫేక్ ప్రచారం తారాస్థాయికి చేరుకుందన్న చర్చలు అదే సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. టీడీపీ, బీజేపీ నేతలు కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ సోషల్ మీడియా ఏదైనా ఫేక్ చేయడంలో ముందుంటోందనే ఎక్కువమంది అభిప్రాయంగా వినిపిస్తోంది.
Discussion about this post