కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సత్తా చాటుతూనే ఉంది. అలాంటిది ఇప్పుడు గన్నవరంలో టిడిపి కష్టాల్లో ఉంది. ఆ పార్టీ తరఫున ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే వంశీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోతున్నారని తెలుస్తోంది. పూర్తిగా ఇక్కడ వంశి హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలు నుంచి వంశీ టిడిపి తరఫున విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.
అయితే టీడీపీ అధికారం కోల్పోవడం, తనకు అనుకూల పరిస్థితి లేకపోవడంతో వంశీ వైసిపి వైపు వచ్చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా డైరెక్ట్ గా వైసీపీలో చేరకుండా జగన్‌కు మద్దతు ఇచ్చారు. అంటే అనధికారికంగా వంశీ వైసీపీ ఎమ్మెల్యే గా ముందుకు వెళ్తున్నారు. ఇలా వైసీపీ వైపు వంశీ వెళ్లడంతో గన్నవరంలో టిడిపి పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేకుండాపోయారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు, జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బచ్చుల అర్జునుడుని ఇన్చార్జిగా పెట్టారు.మొదట్లో అర్జునుడు దూకుడుగానే రాజకీయం చేశారు. కానీ తర్వాత అర్జునుడు సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సైతం పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ ఎక్కువగా వైసిపి హవా నడిచింది. వంశీ వైసీపీ వైపు ఉండటం వల్లే ఆ పార్టీకి ప్లస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వంశీకి పార్టీలతో పాటు సొంత ఇమేజ్ కూడా ఉంది. అందుకే గన్నవరంలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. దీంతో వంశీ మీద అర్జునుడు తేలిపోతున్నారు. అసలు పోటీ ఇవ్వలేకపోతున్నారని అర్థం అవుతుంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వంశీ విజయాన్ని అడ్డుకోవడం కష్టమైపోతుందని స్థానిక టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కాబట్టి అర్జునుడుని ఫుల్ గా యాక్టివ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు నుంచి పని చేస్తూ ఉంటే మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే బెనిఫిట్ ఉంటుందని అంటున్నారు. కాకపోతే కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా గన్నవరంలో బీసీ వర్గానికి చెందిన అర్జునుడుని ఇంచార్జ్ గా పెట్టడం టిడిపికి అంత కలిసి రాలేదని చెబుతున్నారు.కమ్మ వర్గానికి చెందిన వంశీని ఢీ కొట్టాలంటే అదే వర్గానికి చెందిన మరో నాయకుడిని టీడీపీ నుంచి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.గన్నవరంలో గద్దె ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉందని, అందుకే గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధని ఇక్కడకు తీసుకు వచ్చి నిలబడితే బాగుంటుందని కొందరు అంటున్నారు. అనురాధ అయితే వంశీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. లేదా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేరే నాయకుడిని పెట్టిన ఇబ్బందులు ఉండవని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలా చేస్తారో చూడాలి. అర్జునుడుని ఇన్చార్జిగా కొనసాగిస్తారా లేకపోతే కొత్త నేతని గన్నవరంలో నిలబడతారో చూడాలి.
Discussion about this post