రాజకీయ నేతల నాలుకకు నరం ఉండదు…అవసరానికి తగ్గట్టుగా నాలుకని మడతపెట్టేస్తారు. అప్పటికప్పుడు ఉన్న పరిస్తితులని బట్టి అడ్డగోలుగా రాజకీయం చేయడంలో ఏపీలో అధికార వైసీపీకి తిరుగులేనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విషయాల్లో వైసీపీ నాలుక మడతవేసింది. అధికారంలోకి వచ్చిన మొదట్లో చంద్రబాబు..కావాలనే నలుగురు రాజ్యసభ ఎంపీలని బీజేపీలోకి పంపించారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు.

అసలు బీజేపీతో పొత్తు కోసం బీజేపీ పాకులాడుతుందని, కానీ బీజేపీ, జనసేనలు…టీడీపీని దగ్గరకు కూడా రానివ్వడం లేదని మంత్రి కొడాలి నాని లాంటి వారు మాట్లాడారు. అయితే ఇప్పుడు మళ్ళీ మాట మార్చేశారు. రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ, జనసేనలు కలిసి పనిచేస్తున్నాయని మాట్లాడుతున్నారు. మొన్నటివరకు ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేసేవారు కాదు.

కానీ ఇటీవల బీజేపీ నేతల విమర్శల దాడి పెరిగింది. ఏపీ చేస్తున్న అప్పులని వారు ప్రశ్నిస్తున్నారు. అటు కేంద్రం కూడా ఏపీ చేసిన అప్పులపై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అప్పులపై పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక అంశంపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుందని అంటున్నారు. అప్పుల విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిందించలేదని అంటున్నారు. ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేనలు కలిసి పనిచేస్తున్నాయని, తమపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

అప్పులపై కేంద్రం, రాష్ట్రాన్ని ప్రశ్నిస్తే వైసీపీ నేతలు ఏమో…బీజేపీ-టీడీపీలకు లింక్ పెట్టడం మరీ అడ్డగోలుగా ఉందని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. టీడీపీకి భయపడే ఈ విధంగా మొదట నుంచి వైసీపీ నేతలు మాటలు మారుస్తూ వస్తున్నారని అంటున్నారు.
Discussion about this post